అక్రమ వలసదారులని వదలని ట్రంప్‌.. కొత్త గేమ్‌ స్టార్ట్‌ | White House launches deportation video games to promote Trump agenda | Sakshi
Sakshi News home page

అక్రమ వలసదారులని వదలని ట్రంప్‌.. కొత్త గేమ్‌ స్టార్ట్‌

Sep 4 2026 7:56 AM | Updated on Sep 4 2026 9:50 AM

White House launches deportation video games to promote Trump agenda

డొనాల్డ్‌ ట్రంప్ ఈ పేరు వింటే చాలు అమెరికాలోని అక్రమ వలసదారులకు కంటిమీద కులుకు ఉండదు.. మేక్ అమెరికా గ్రేట్‌ ఎగేన్ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ యూఎస్‌ఏలోని అక్రమ వలసదారులపై కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ విధానాలను అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైట్‌హౌస్‌ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో అక్రమ వలసదారులను తరిమికొట్టేలా కొత్త గేమ్స్‌ను లాంఛ్‌ చేసింది.

వైట్ హౌస్ అధికారిక వెబ్‌సైట్‌లో క్లాసిక్ ఆర్కేడ్ గేమ్స్ తరహాలో ఐదు వీడియో గేమ్స్‌తో కూడిన ‘ఆర్కేడ్’ పేజీని ప్రారంభించింది. అయితే సాధారణ గేమ్స్‌కు భిన్నంగా.. వీటిలో ట్రంప్ ప్రభుత్వ రాజకీయ విధానాలు, ముఖ్యంగా సరిహద్దు భద్రత, వలసదారుల డిపోర్టేషన్, ఆరోగ్యకరమైన ఆహారం, పిల్లల పొదుపు ఖాతాలు వంటి అంశాలను గేమింగ్ రూపంలో చూపించారు.

ఈ గేమ్స్‌లో కొన్ని అమెరికాలో గతంలో బాగా ప్రాచుర్యం పొందిన క్లాసిక్ గేమ్స్‌ను పోలి ఉన్నాయి. టెట్రిస్, స్నేక్, ఫ్లాపీ బర్డ్ వంటి గేమ్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. వాటికి ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’  ప్రచారానికి అనుగుణంగా రూపొందించారు. ఇందులో ‘బిల్డ్ ద వాల్’ అనే గేమ్ టెట్రిస్‌ను పోలి ఉంటుంది. ఇందులో ఆటగాడు అమెరికా-మెక్సికో సరిహద్దును కాపాడేందుకు గోడ నిర్మించాల్సి ఉంటుంది. గేమ్ సూచనల్లో “రాబోయే గుంపు నుంచి సరిహద్దును రక్షించండి” అనే సందేశాన్ని పెట్టారు. అంటే ట్రంప్ చాలాకాలంగా ప్రచారం చేస్తున్న సరిహద్దు గోడ నిర్మాణ విధానాన్ని గేమ్‌గా మార్చారు.

మరో గేమ్ ‘రియో రన్’. ఇది ప్రముఖ ‘స్నేక్’ గేమ్‌ను పోలి ఉంటుంది. ఇందులో ట్రంప్ ప్రభుత్వ బోర్డర్ విధానాలతో సంబంధం ఉన్న పాత్ర వలసదారులను వెంబడించేలా గేమ్‌ను రూపొందించారు. రియో గ్రాండే నది, అమెరికా-మెక్సికో సరిహద్దు ప్రాంతం వంటి అంశాలను ఇందులో చూపించారు. వలసదారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని వినోదాత్మక గేమ్ రూపంలో చూపించడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది.

‘ఫ్లాపీ బిల్’ అనే మరో గేమ్‌లో అమెరికా జాతీయ చిహ్నమైన ఈగిల్ ఒక బిల్లును వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ మీదుగా తీసుకెళ్లేలా రూపొందించారు. ఇది ట్రంప్ ప్రభుత్వం తీసుకువస్తున్న లేదా మద్దతిస్తున్న చట్టపరమైన చర్యలకు సంబంధించిన ప్రచారంగా తీసుకవచ్చారు. వైట్ హౌస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ గేమ్స్‌ను ప్రచారం చేస్తూ   “గెలుపును ఆపలేం.. గోడ కట్టండి.. డిపోర్ట్ చేయండి.. ట్రంప్ అకౌంట్‌ను నింపండి” అనే సందేశంతో పోస్ట్ పెట్టింది.  తన ప్రభుత్వ విధానాలను ఒకే ప్రచార సందేశంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.

వైట్‌హౌస్‌ ప్రకటన

ఈ కొత్త ప్రచారంపై వైట్ హౌస్ తన ఉద్దేశాన్ని సైతం స్పష్టం చేసింది. అధ్యక్షుడి విజయాలు, విధానాలను ప్రతి అమెరికన్‌కు సులభంగా అర్థమయ్యేలా, వారికి చేరువయ్యే విధంగా చెప్పేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. సరదా, గెలుపు అనే సంస్కృతిని ఒకవైపు చూపిస్తూ.. డెమొక్రాట్ల రాజకీయ దృక్పథాన్ని ‘చీకటి సోషలిస్టు విజన్’గా చిత్రీకరించేందుకు ఇది ఒక ప్రయత్నమని పేర్కొంది.


భగ్గుమన్న మానవహక్కుల సంఘాలు

అయితే ఈ గేమ్స్‌పై అమెరికాలోని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముఖ్యంగా వలసదారుల డిపోర్టేషన్‌ను వీడియో గేమ్‌గా చూపించడాన్ని వారు తప్పుబట్టారు. టెక్సాస్‌లోని ఈగల్ పాస్‌కు చెందిన ఫ్రొంటెరా ఫెడరేషన్ సహ-డైరెక్టర్ అమెరికా గార్సియా గ్రేవాల్ ఈ ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం ‘ఆటలాడుతోందని’, ఇప్పుడు అదే చర్యలను వీడియో గేమ్‌గా మార్చిందని ఆమె విమర్శించారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమెరికా పౌరులు కూడా అనుమానం, హింసను ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement