పుతిన్‌ ప్రేమలో పడ్డారా? ఆమెతో సన్నిహితంగా!

Vladimir Putin Has Found Lover Ekaterina Mizulina love Barbie Lookalike - Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక మిస్టరీగా ఉంటుంది. 71 ఏళ్ల పుతిన్‌.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. అయతే తాజాగా  అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తనకంటే 32 ఏళ్ల‌  చిన్న వయస్సు గల ఎకటెరినా మిజులినాతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తోంది. 

న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. 39 ఏళ్ల ఎకటెరినా మిజులినాతో పుతిన్‌ ప్రేమాయానం కొనసాగిస్తున్నారని ఓ కథనాన్ని ప్రచురించింది. ఎకటెరినా మిజులినా ఒక చరిత్రకారిణి. రష్యా అనుకూల సేఫ్‌ ఇంటర్‌నెట్‌ లీగ్‌ సంస్థకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను సెన్సార్‌ చేస్తూ ఉంటుంది. రష్యాకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌ వ్యాపించే వ్యతిరేకమైన కంటెంట్‌ను నిషేధిస్తుంది. ఎకటెరినా మిజులినా.. 69 ఏళ్ల సెనేటర్ ఎలెనా మిజులినా కుమార్తె. ఎలెనా మిజులినాకు అధ్యక్షుడు పుతిన్‌ బలమైన మద్దతుదారు అనే పేరుంది.

‘అందమైన బార్బీ బొమ్మలాంటి  ఆకర్షించే రూపాన్ని కలిగిన ఉన్న మిజులినా అధ్యక్షుడు పుతిన్‌ పట్ల అభిమానం, విధేయత  కలిగి ఉంటారు. ఎకటెరినా మిజులినా.. అధ్యక్షుడు పుతిన్‌కు సరైన జోడి. పుతిన్‌ అభిరుచికి అనుగుణంగా ఎకటెరినా ఉంటుంది’అని రష్యన్‌ మానవ హక్కుల కార్యకర్త ఓల్గా రొమానోవా  ఉక్రెయిన్‌ న్యూస్‌​ చానెల్‌కు తెలిపారు.

మిజులినా.. 2004లో లండన్ విశ్వవిద్యాలయం కళా చరిత్ర, ఇండోనేషియా భాషలో పట్టభద్రులయ్యారు. 2017లో సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌లో చేరడానికి ముందు చైనాను సందర్శించే అధికారిక రష్యన్ ప్రతినిధుల బృందానికి అనువాదకురాలిగా పనిచేశారు. 

రహస్య ప్రేయసి అలీనా కబయేవా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఓ రహస్య ప్రేయసి ఉందని, ఆమె పేరు అలీనా కబయేవా అని, ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్‌ నడిచింది. అలీనా కబయేవా.. గతంలో జిమ్నాస్ట్‌గా ఉండేది. పుతిన్‌ విడాకుల తర్వాత ఆయనతో చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్‌గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్‌ చూపిస్తోందని వార్తలు వచ్చాయి.

చదవండి: Vladimir Putin Secret Lover: పుతిన్‌ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది?

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top