ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!

Viral Video Shows Drones Designed To Tase Migrants At Border - Sakshi

నిజానికి టెక్నాలజీ మానవాభివృద్ధికి తోడ్పడాలి గానీ అతని మనుగడే ప్రశ్నర్థకమయ్యేలా హింసాత్మక ధోరణికి దారితీసే విధంగా ఉండకూడదు.  మానవుడు తాను సృష్టించిన టెక్నాలజీతో రకరకాల సమస్యలను సృష్టించుకుంటున్నాడు లేదా కొని తెచ్చకుంటున్నాడు అని నిపుణుల హెచ్చరిస్తున్న సందర్భాలను అనేకం చూశాం.  ప్రస్తుతం అలాంటి టెక్నాలజీని యూఎస్‌లోని ఒక కంపెనీ ఆవిష్కరించడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురైంది.

(చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్‌​ అన్‌లాక్‌ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!)

అసలు విషయంలోకెళ్లితే....యూఎస్‌లో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన బ్లేక్ రెస్నిక్ లాస్ వెగాస్‌లో 2017లో జరిగిన భారీ కాల్పుల నేపథ్యంలో అహింసాయుత రోబోల వినియోగంతో చట్టాలను అమలు చేసే సంస్థలకు సహాయం చేసే ఉద్దేశంతో బ్రింక్‌ అనే టెక్‌సంస్థను స్థాపించాడు. ఏ మంచి ఉద్దేశంతో ఆ కంపెనీని ప్రారంభించాడో అది ఇప్పుడు విభిన్నమైన మలుపు తీసుకుని సరిహద్దుల వద్ద వలసదారులను పట్టుకోవడానికి అత్యధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్‌లను రూపొదించింది. అయితే వీటిని వాల్‌ ఆఫ్‌ డ్రోన్స్‌ అని పిలుస్తారు. పైగా ఇది యుఎస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల కదలికలనే కాక వారిని ట్రాక్‌ చేయగలదని కంపెనీ పేర్కొంది.

అంతేకాదు డ్రోన్‌లు ముందుగా ప్రోగ్రామ్ చేసిన విమాన మార్గాన్ని అనుసరిస్తాయని చొరబాటుదారుల కోసం వెతకడానికి హై-డెఫినిషన్ కెమెరాల తోపాటు థర్మల్ ఇమేజర్‌లను ఉపయోగిస్తాయని రెస్నిక్‌ తెలిపారు. పైగా డ్రోన్ చొరబాటుదారుని గుర్తించినప్పుడల్లా సమీపంలోని నియంత్రణ కార్యాలయంలోని ఆపరేటర్లకు విషయాన్ని బదిలీ చేస్తుందన్నారు. ఈ మేరకు జోస్' అనే ఒక వలసదారుని పట్టుకున్నట్లు రెస్నిక్‌ వెల్లడించారు.

అంతేకాదు ఈ టెక్నాలజీ సంబంధించిన వీడియోని ప్రమోషన్‌ నిమిత్తం 2018లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు మనిషి స్వేచ్ఛయుత  జీవనానికి ప్రతిబంధకం ఈ టెక్నాలజీ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. అయితే కంపెనీ కూడా తన ఈ డ్రోన్‌ టెక్నాలజీ వినియోగం పై పునారాలోచించడమే కాక ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకున్నాం అని కూడా ప్రకటించడం కొసమెరుపు.

(చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top