Viral Video: Man Builds Secret Tunnel Under The Bed - Sakshi
Sakshi News home page

వార్నీ.. మంచం కింద ఇంత పెద్ద సొరంగమా..!

Jun 26 2021 12:58 PM | Updated on Jun 26 2021 4:37 PM

Viral Video Man Builds Secret Tunnel Under The Bed - Sakshi

సాధారణంగా పాత సినిమాలు, పురాతన కథల్లో సొరంగ మార్గాల గురించి చదవడం, చూడటం చేశాం. శత్రువులు దాడి చేసినప్పుడు తప్పించుకోవడం కోసం, వేరే రక్షణ చర్యల్లో భాగంగా రాజుల కాలంలో ఇలా సొరంగాలను ఏర్పాటు చేసుకునేవారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా అప్పుడప్పుడు.. అక్కడక్కడ ఈ సొరంగ మార్గాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా తన బెడ్‌ కింద నుంచి ఓ కిలోమీటర్‌ పొడవు సొరంగం తవ్వాడు. వీడియో చూసినవారు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. 

ఓ వ్యక్తి బెడ్‌ని తెరవడంతో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మెట్లు, అలా ఓ మార్గం కనిపిస్తుంది. ఇక లోపలంతా పచ్చని లైట్‌ ఉండి.. సొరంగంలోని దృశ్యాలను చూపిస్తాయి. ఇది చూసిన నెటిజనులు ‘‘ఒసామా బిన్‌ లాడెన్‌ దాక్కున్న సొరంగం ఇదేనా ఏంటి’’.. ‘‘ఈ వీడియోని చూస్తే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది.. సైకిక్‌ ప్యాలేస్‌గా ఉంది’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: రూ.90 లక్షల ప్లాట్‌ కొని.. సొరంగం తవ్వి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement