వైరల్‌: తండ్రి లైవ్‌ ఇంటర్వ్యూలో కొడుకు చిలిపి చేష్టలు..

Viral Video Of Kid Crashes Fathers Live Interview On TV - Sakshi

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్ని నెలల పాటు అన్ని కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఆఫీస్‌ తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలో అందరూ ఇంటి నుంచి పనులు చేసుకుంటారు. ఇప్పటికీ కొన్ని కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. కరోనా దెబ్బతో పిల్లలకు క్లాస్‌లు, ఇంటర్వ్యూలు కూడా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. అయితే ఇంట్లో నుంచి లైవ్‌ మీటింగ్‌లు, డిబెట్‌లు చేస్తుండగా కొన్నిఇబ్బందులు తలెత్తడం సహజమే. 
చదవండి: వైరల్‌: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి..

తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి టీవీ ఛానల్‌కు లైవ్‌ ఇంటర్వ్యూ ఇస్తుండగా తన పిల్లలు అంతరాయం కలిగించాడు.  తండ్రి వెనకాలకు వచ్చిన కొడుకు కెమెరాకు హాయ్‌ చెబుతూ కనిపించాడు. ఇది గమనించిన వ్యక్తి కొడుకును పక్కకు పంపేందుకు ప్రయత్నించగా అతడు వెళ్లిపోయాడు. అయితే మళ్లీ స్క్రీన్‌ ముందుకు వచ్చిన పిల్లవాడు తండ్రి వెనకాల డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాడు. పిల్లవాడి చేష్టలకు చివరికి యాంకర్‌ కూడా నవ్వేశాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top