
అంతా పెళ్లి రిసెప్షన్ వేడుకల్లోఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆనందంగా నృత్యం చేస్తున్న మహిళ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం అయ్యే లోపే అంతులేని విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురం మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.
పలు మీడియా నివేదికల ప్రకారం తమిళనాడులోని జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు కాంచీపురం నివాసితులు జీవా , ఆమె భర్త జ్ఞానం. తమ స్నేహితుడి కొడుకు వివాహ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా, ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు వేల్‌మురుగన్ పాల్గొన్న సంగీత కచేరీని నిర్వహించారు. ఈ సమయంలో, వేల్‌మురుగన్ ప్రేక్షకులను వేదికపైకి వచ్చి నృత్యం చేయమని ఆహ్వానించారు.

అలా జీవా కూడా ఆమె వేదిక పైకి వెళ్లి నృత్యం చేయడం ప్రారంభించింది. అంతలోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెకు వేదిక వద్దనే ప్రథమ చికిత్స అందించారు. అయినా స్పందించచకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. జీవా కుప్పకూలిపోయే ముందు నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Woman dies after collapsing while dancing on stage at wedding event in Mamallapuram, in Tamil Nadu’s Chengalpattu district.#TamilNadu #Tragedy #ITVideo #SoSouth #Chengalpattu @PramodMadhav6 pic.twitter.com/18SkHkx4X2
— IndiaToday (@IndiaToday) August 20, 2025