
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్, వీర శూర సాహస వైరల్ స్టంట్స్ ద్వారా మాత్రమే కాదు దాతృత్వ కార్యక్రమాల ద్వారా కూడా ప్రసిద్ధి పొందాడు. తాజాగా... పదిహేను గంటల నలభై నిమిషాల΄ాటు మారథాన్ లైవ్‌స్ట్రీమ్ చేసి రికార్డ్ సృష్టించాడు. మారథాన్ లైవ్‌స్ట్రీమ్ ముగిసే సమయానికి వందకోట్లు సేకరించాడు. ఈ నిధులను ‘టీమ్‌వాటర్’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం ఉపయోగిస్తారు. సురక్షితమైన తాగునీటి కోసం పనిచేస్తోంది టీమ్ వాటర్.
లైవ్‌స్ట్రీమ్ ద్వారా అధిక నిధులు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటుసాధించాడు మిస్టర్ బీస్ట్. ‘ఈ స్ట్రీమ్ ద్వారా ఎంతోమంది జీవితాలు మారుతాయి’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘మిస్టర్ బీస్ట్’గా సుపరిచితుడైన జేమ్స్ జిమ్మీ డోనల్డ్‌సన్ ప్రపంచంలోని యూట్యూబర్‌లలో అగ్రగామి. ఈ మోస్ట్ పాపులర్ యూట్యూబర్‌కు ప్రపంచవ్యాప్తంగా 422 మిలియన్‌ల సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.
‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సాధించిన ఈ సంపన్నుడికి యూట్యూబ్ స్ట్రీమింగ్ షోలతో పాటు ఫాస్ట్‌ఫుడ్ చైన్‌లు కూడా ఆదాయ మార్గాలు. ‘రింగ్‌మాస్టర్ ఆఫ్ స్టంట్స్ అండ్ ఛాలెంజెస్’ అని ఈ సోషల్ మీడియా మెగా స్టార్‌ను ఆకాశానికెత్తింది ఫోర్బ్స్. ‘థ్రెడ్’లో ఒక మిలియన్ ఫాలోవర్స్‌ను సాధించిన తొలి వ్యక్తిగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు మిస్టర్ బీస్ట్.
(చదవండి: సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..)