
అమ్మాయిలు అన్ని రంగాల్లోకి రావాలని చెబుతుంటారు. గానీ ఇంట్లో వాళ్ల వల్లనో సమాజం ధోరణి కారణంగానే కొన్ని రంగాలవైపుకి అస్సలు రారు. పొరపాటున కన్నెత్తి కూడా అటువైపుగా చూడరు. కానీ ఈ అమ్మాయి తనకు డ్రైవింగ్ ఇష్టం అని చెప్పడమే కాదు ఏ వాహనమైనా సరే నడిపేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఆమె ధైర్యానికి, ఆలోచన తీరుకి ఫిదా అవ్వుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
తమన్నా తన్వీర్ అనే ప్రయాణికురాలు ఓలా లేదా రాపిడో బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో..ఏదో ఒక ఆటోని పట్టుకని వెళ్లిపోదాం అనుకుంటుంది. సరిగ్గా ఆ సమయానికి ఒక మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటో ఎదురవుతుంది. మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటోని చూడటం ఇదే తోలిసారి అనుకుంటూ తమన్నా వెంటనే ఎక్కేయడమే గాక..ఆ రైడ్‌లో తనతో మాటలు కలుపుతుంది.
అదంతా రికార్డు చేసి నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో సఫురా అనే మహిళా డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లు చూడొచ్చు. తనకు డ్రైవింగ్ అంటే పాషన్ అని, ఏ వెహికల్ అయినా నడుపుతానని చెబుతోంది. అయితే తన వద్ద అంత బడ్డెట్ లేకపోవడంతో ఆటోతో ప్రారంభించానని, భవిష్యత్తులో స్విఫ్ట్ కారు కొనాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తనకు ఇలా డ్రైవింగ్ చేయడం ఇష్టమైన పని కాబట్టి, అలసట అనిపించిందని చెబుతోంది.
ప్రతిరోజు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపింది. మరి తన కుటుబం ఈ వృత్తిని ఎంచుకుంటే ఏం అనలేదా అని ప్రయణికురాలు తమన్నా ప్రశ్నించగా..మొదట తన అమ్మ భయపడిందని, అయితే తన కూతురు ధైర్యవంతురాలని, ఏదైనా చేయగలదని ఆమెకు తెలుసని గర్వంగా చెప్పింది. రైడ్ ముగింపులో తమన్నాకు హైఫై ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయింది.
సఫురా మూసధోరణలను బద్ధలు కొట్టి మహిళలకు స్ఫూర్తిని అందివ్వడమే కాకుండా మనసుకు నచ్చింది చేయడంలో ఉన్న ఆనందం ప్రాముఖ్యతను కూడా హైలెట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె శక్తికి సలాం అంటున్నారు, ఏళ్లనాటి స్లీరియోటైప్‌ను బద్దలు కొట్టినందుకు హ్యాట్సాఫ్ అంటూ కీర్తిస్తున్నారు.
(చదవండి: పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..)