వైరల్‌: ప్రేమ ఎంత మధురమో చూడండి.. | Viral video: elderly Man surprises His Wife With a New Diamond Ring | Sakshi
Sakshi News home page

వైరల్‌: ప్రేమ ఎంత మధురమో చూడండి..

Aug 20 2020 9:16 AM | Updated on Aug 20 2020 11:18 AM

Viral video: elderly Man surprises His Wife With a New Diamond Ring  - Sakshi

ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోని వారైనా తమ ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్త పరుస్తుంటారు. ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాదు. వాళ్లకు కావాల్సిన దానిని ఇచ్చి మన ప్రేమను తెలియ జేయవచ్చు. మన ఇంట్లో వాళ్లకు లేదా ఇష్టపడేవాళ్లకు ఏదైనా గిఫ్ట్‌ ఇచ్చి వాళ్లను సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంటాం ఆ క్షణంలో వాళ్ల ముఖంపై కలిగే చిరునవ్వు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తాజాగా ఓ వ్యక్తి తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్‌‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ ఆ జంట నవ దంపతులు కాదు.. వారికి పెళ్లి అయ్యి 67 సంవత్సరాలు అవుతోంది. (భ‌ర్త లేడు: కొడుకును పెళ్లాడిన‌ త‌ల్లి?)

వృద్ధుడు తన భార్యకు చిన్న గిఫ్ట్‌ బాక్స్‌ను అందించాడు. ఆమె ఆశ్చర్యంగా దానిని తీసుకొని తెరిచి చూడగా షాక్‌కు గురైంది. అందులో అచ్చం ఆమె నర్సింగ్‌ హోమ్‌లో పోగొట్టుకున్న పెళ్లినాటి ఉంగరం లాంటిదే ఉంది. దీన్ని చూసిన వృద్ధురాలు ఆనందంలో తేలిపోయింది. అయితే తన భార్య పెళ్లి ఉంగరం పోయిందని తెలుసుకున్న అతడు ఆమెకు కొత్త డైమండ్‌ ఉంగరాన్ని కొని తెచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బుధవారం ఓ మీడియా తన ట్విటర్‌లో పోస్టు చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 36 వేల మంది చూడగా.. అనేక మంది నెజిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘నిజమైన ప్రేమకు అంతం ఉండదు.. ఈ వీడియో చూస్తుంటే కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు.’ అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (వైరల్‌: టాయిలెట్‌లోకి పాము ఎలా వచ్చింది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement