భ‌ర్త లేడు: కొడుకును పెళ్లాడిన‌ త‌ల్లి? | Fact Check: Viral Story Marriage Between Son And His Mother Is False | Sakshi
Sakshi News home page

ఫ్యాక్ట్ చెక్‌: కొడుకును పెళ్లి చేసుకున్న త‌ల్లి?

Aug 20 2020 8:37 AM | Updated on Aug 20 2020 11:02 AM

Fact Check: Viral Story Marriage Between Son And His Mother Is False - Sakshi

కౌల‌లాంపూర్‌: ర‌ష్యాలో ఓ మ‌హా త‌ల్లి ఆమె ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటున్న‌ కొడుకునే పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న మనం ఇదివ‌ర‌కే చూశాం.  తాజాగా మ‌లేషియాలోనూ ఓ త‌ల్లి కొడుకుని పెళ్లి చేసుకుందంటూ ఓ వార్త ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. రాజ‌శ్రీ సెల్వ‌కుమార్ అనే ట్విట‌ర్ అకౌంట్ నుంచి.. "నా కొడుకు ప‌న్నెండేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు మొద‌టి భ‌ర్త చ‌నిపోయాడు. అప్పుడు నా వ‌య‌సు 30. కొడుకుతో క‌లిసి నివ‌సిస్తూ ఉండ‌గా ఓ రోజు వాడు నా ముందు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టాడు. అత‌డి కాలేజీ ఐపోయిన కొద్ది నెల‌ల త‌ర్వాత పెళ్లికి అంగీక‌రించాను. అలా 2016లో ఇద్ద‌రం వివాహం చేసుకున్నాం. ఇప్పుడు మాకు మూడేళ్ల కొడుకున్నాడు" అని పోస్ట్ పెట్టారు. దీనికి కొన్ని ఫొటోల‌ను కూడా జ‌త చేశారు. (కొడుకును పెళ్లాడిన సోష‌ల్ మీడియా స్టార్‌)

అయితే ఇది అబ‌ద్ధ‌మ‌ని తేలింది. స‌ద‌రు ఫొటోలు మ‌లేషియాకు చెందిన జంట ప్ర‌తిలాస్మి సెల్వ‌రాజ్‌, సేల రాజేంద్ర ‌వ‌ని నిర్ధార‌ణ అయింది. పైగా వీళ్లిద్ద‌రూ తొమ్మిదేళ్ల రిలేష‌న్‌షిప్ త‌ర్వాత‌ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇక త‌మ ఫొటోలు త‌ప్పుడుగా ప్ర‌చారమ‌వుతున్నాయ‌ని తెలిసిన ఈ జంట షాక్‌కు గుర‌య్యారు. దీనిపై సేల రాజేంద్ర మాట్లాడుతూ.. 'ఇదంతా ఎవ‌రు చేశారో అర్థం కావ‌డం లేదు. మాకు ఎవ‌రూ శ‌త్రువు లేరు కానీ ఇలా మ‌మ్మ‌ల్ని బ‌జారులో నిల‌బెట్టిన వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాం' అని పేర్కొన్నారు. మ‌రోవైపు ఫేక్ న్యూస్ సృష్టించి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించిన‌ సెల్వ కుమార్ అనే ట్విట‌ర్ అకౌంట్‌ను డిలీట్ చేశారు. (పెళ్లికి ముందు వీటిని అడుగుతున్నారా?)

వాస్త‌వం: మ‌లేషియాలో త‌ల్లి, కొడుకును పెళ్లి చేసుకోలేదు. వైర‌ల్ అవుతున్న ఫొటోల్లో ఉన్న‌ది నిజ‌మైన భార్యాభ‌ర్త‌లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement