అమెరికా మహిళల ఉద్యోగాలకు కరోనా సెగ

The US.Economy Lost 140,000 Jobs In December - Sakshi

అమెరికాలో డిసెంబర్‌లో  140,000 ఉద్యోగాలు హాంఫట్‌

రాబోయే రోజుల్లో మరింత ముదరనున్న ప్రమాదం

పాఠశాలలు, డే కేర్‌ సెంటర్స్‌ మూతతో  ఉపాధి కోల్పోతున్నమహిళలు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఉద్యోగ అవకాశాలపై భారీ ప్రభావాన్నే చూపింది. ముఖ్యంగా అమెరికాలో పురుషులతో పోలిస్తే ఉపాధిని కోల్పోయిన వారిలో మహిళలే ఎక్కువ ఉన్నారు. నేషనల్ ఉమెన్స్ లా సెంటర్ (ఎన్‌డబ్ల్యుఎల్‌సి)  విశ్లేషణ ప్రకారం డిసెంబరు నెలలో కోల్పోయిన అమెరికా నిరుద్యోగిత రేటు 6.7శాతంగా ఉంది. ఇందులో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 111 శాతం మహిళలు ఉండటం గమనార్హం. డిసెంబరులో  పురుషులు 16,000 ఉద్యోగాలు పొందారు. మహిళలు 140,000 ఉద్యోగాలను కోల్పోయారు. 

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో అమలు చేసిన లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే ఆర్ధికవ్యవస్థలు మాంద్యంలోకి జారుకున్నారు. అనేక రంగాల్లో ఉపాధి కల్పన ఘోరంగా దెబ్బతింది. వ్యాపారం లేక పలు కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా అనేకమంది ఉద్యోగాలను తొలగించాయి. శుక్రవారం విడుదల చేసిన కొత్త గణాంకాల ప్రకారం, షాకింగ్‌ జెండర్‌ గ్యాప్‌ వెలుగులోకి వచ్చింది డిసెంబరులో 140,000 ఉద్యోగాలను కోల్పోయారు. మరోవైపు పురుషులు 16వేల ఉద్యోగాలను సాధించారు. అంటే మొత్తం 156,000 ఉద్యోగాలను కోల్పోయినట్టు లెక్క. కరోనా కాలంలో పురుషులు కూడా తమ ఉద్యోగాలను కోల్పోయినప్పటికీ, మహిళల నష్టం భారీగా ఉంది. ఫిబ్రవరి నుండి ఏకంగా దాదాపు 2.1 మిలియన్ల మంది మహిళలు ఉద్యోగాలనుంచి పూర్తిగా తప్పుకున్నారు, అంతేకాదు మరో బాధాకరమైన వాస్తవికతను వెలుగులోకి తెచ్చిందీ రిపోర్టు. వర్కింగ్‌ విమెన్‌లో నల్లజాతీయులు, లాటిన్‌ మహిళలు భారీగా ఉద్యోగాలు కోల్పోగా, శ్వేతజాతీయులపై ఈ ప్రభావం చాలా తక్కువ. 

పిల్లల బాధ్యత, ఇంటిబాధ్యత నేపథ్యంలో పార్ట్‌టైమ్ పని చేసే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ అని ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్స్ అధ్యక్షులు సీఈఓ నికోల్ మాసన్ అన్నారు. ఇంకా మహమ్మారి నియంత్రణలోకి రాకపోవడం, డే కేర్‌ సెంటర్‌లు మూసివుండటం  ప్రభావితం చేసిందన్నారు. రెస్టారెంట్లు, బార్లు మూసివేతతో  పార్ట్‌టైమ్ కార్మికులగా మహిళలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సంక్షోభం ప్రభావం రాబోయే సంవత్సరాల్లో మరింత అధికంగా ఉండనుందనీ, మహిళల ఆర్థిక భద్రతకు, మహిళలపైనే ఆధారపడిన కుటుంబాలకు  సంకటంగా మారనుంది. 

ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో పురుషులు  ఉపాధి కోల్పోవడం సహజం. ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చే నిర్మాణ రంగ, ఉత్పత్తి పరిశ్రమల్లో వారు ఎక్కువగా పని చేయడం దీనికి ఒక కారణం. మహిళలు విద్య, ఆరోగ్య రంగాలలో ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈరంగాలు ప్రభావితంకావడం మహిళల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసింది. 1975 తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంమీద, మహమ్మారి ప్రారంభానికిముందు, ఫిబ్రవరి నుంచి పురుషులు 4.4 మిలియన్ల ఉద్యోగ నష్టంతో పోలిస్తే. మహిళలు 5.4 మిలియన్ల ఉద్యోగాలను కోల్పోయారు. 2020 ప్రారంభంలో సమాన స్థాయిలో 50.03 శాతం ఉద్యోగాలను కలిగి ఉన్నా, మగవారి కంటే తక్కువ ఉద్యోగాలే. అయితే అమెరికా చరిత్రలో తొలిసారిగా కేవలం మూడు నెలలు (2009లో స్వల్ప కాలంలో, 2010 ప్రారంభంలో) మాత్రమే పురుషుల కంటే మహిళలు  ఎక్కువ ఉద్యోగాలను సంపాదించారట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top