ఖషోగ్గి హత్య: అమెరికా సంచలన ఆరోపణలు

US Report Said Saudi Prince Approved Operation To Capture Or Kill Khashoggi - Sakshi

ప్రిన్స్‌ సల్మాన్‌ ఆదేశాల మేరకే ఖషోగ్గి హత్య

నివేదిక విడుదల చేసిన అమెరికా

అమెరికా నివేదికను ఖండించిన సౌదీ రాజు

వాషింగ్టన్‌ : సౌదీ అరేబియా రాజు మహ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ ఆదేశాల మేర‌కు జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గి హ‌త్య జ‌రిగిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది.  2018లో ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖ‌షోగ్గి దారుణ హ‌త్య‌కు గురైన సంగతి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన ఆ దారుణంపై అమెరికా ప్ర‌భుత్వం తాజాగా నివేదిక‌ను విడుదల చేసింది. ఖ‌షో‍గ్గిని బంధించండి లేదా హ‌త్య చేయాలంటూ ప్రిన్స్ స‌ల్మాన్ ఆదేశించిన‌ట్లు ఆ నివేదిక‌లో తెలిపింది. ప్రిన్స్‌ అనుమతి లేకుండా.. ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద దారుణం చోటు చేసుకోవడం అసంభవం అని నివేదికలో పేర్కొన్నది. అయితే అమెరికా నేరుగా సౌదీ రాజుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.  

నివేదికను వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ప్ర‌భుత్వం సౌదీపై డ‌జ‌న్ల సంఖ్య‌లో ఆంక్ష‌ల‌ను ప్ర‌క‌టించింది. అయితే అమెరికా రిలీజ్ చేసిన నివేదిక‌ను సౌదీ అరేబియా కొట్టిపారేసింది. అదో నెగ‌టివ్‌, త‌ప్పుడు రిపోర్ట్ అని పేర్కొన్న‌ది. జ‌ర్న‌లిస్టు ఖ‌షోగ్గి మ‌ర్డ‌ర్ కేసులో త‌న పాత్ర‌లేద‌ని సౌదీ రాజు మహ్మ‌ద్ తెలిపారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి  హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఖషోగ్గి తన మ్యారేజ్‌ పేపర్స్‌ కోసం కాన్సులేట్‌ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి. అయితే వీటిని సౌదీ ప్రభుత్వం కొట్టి పారేసింది. ఈ క్రమంలో ఖ‌షోగ్గి మ‌ర్డ‌ర్ ఆప‌రేష‌న్‌కు ప్రిన్స్ స‌ల్మాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు రుజువు చేసేందుకు మూడు కార‌ణాల‌ను అమెరికా నివేదిక పేర్కొన్న‌ది.  

చదవండి: 
సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం?
‘ఓవెన్‌ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top