US President Joe Biden on Surprise Visit To Kyiv - Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడి బిగ్‌ సర్‌ప్రైజ్‌.. ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన

Feb 20 2023 4:20 PM | Updated on Feb 20 2023 4:29 PM

US President Joe Biden On Surprise Visit To Kyiv - Sakshi

రష్యా అధ్యక్షుడు పెద్ద తప్పు చేశాడని బైడెన్‌ అంటున్నాడు. 

కీవ్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ సైతం చేశారు. మరికొద్ది రోజుల్లో(ఫిబ్రవరి 24వ తేదీ) ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలై ఏడాది పూర్తి కానుంది. ఈ దరిమిలా ముందుగానే ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించినట్లు స్పష్టం అవుతోంది.

ఏడాది కిందట పుతిన్‌ ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలుపెట్టినప్పుడు..  ఉక్రెయిన్‌ బలహీనమైందని, పాశ్చాత్య దేశాలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయని భావించాడు. అతను మమ్మల్ని అధిగమించగలడని అనుకున్నాడు. కానీ అతను పెద్ద తప్పిదం చేశాడు. ఈ ఏడాది కాలంలో అట్లాంటిక్‌, ఫసిపిక్‌ పరిధిలో ఉన్న అన్ని దేశాలు ఉక్రెయిన్‌ పోరాటానికి కావాల్సిన అన్నిరకాల సాయాన్ని అందిస్తూ వస్తున్నాయి. అందుకు అమెరికా ఒక సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసింది అని ట్వీట్‌ చేశారాయన.

అలాగే.. ఏడాది కాలం దగ్గర పడుతున్న తరుణంలో కీవ్‌లో పర్యటిస్తున్నట్లు.. ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత పట్ల మా(అమెరికా) తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించినట్లు బైడెన్‌ ట్వీట్లు చేశారు.

ఇక యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు.. ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. కిందటి ఏడాది డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. యూఎస్‌ చట్టసభలో ప్రసగించి.. యుద్ధంలో మద్దతు కోరారు. ఇక ఈ ఏడాది  జనవరిలో యూఎస్‌ సెనేటర్ల బృందం ఒకటి కీవ్‌లో పర్యటించింది.  వాస్తవానికి ఆయన పోలాండ్‌లో పర్యటిస్తారని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ల్యాండ్‌ అయ్యి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌  అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. 

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement