Viral Video: జెలెన్‌స్కీ ఇంటి ముంగిటే..నాటు నాటు స్టెప్పులతో దుమ్ములేపిన ఉక్రెయిన్‌ సైనికులు

Ukraine Soldiers Dance To Naatu Naatu Video Goes Viral - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ క్రేజ్‌ మాములుగా లేదు.  ఆ మూవీలో నాటు నాటు సాంగ్‌​ ఆస్కార్‌ అవార్డుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న థియోటర్‌లలో ఇంకా ప్రదర్శితమవుతూనే ఉంది. అదీగాక ఈ పాటకి చిందులు వేస్తూ రోజు ఏదో ఒక వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ అవ్వడం, వైరల్‌ అవ్వడం జరుగుతుంది. తాజగా ఇప్పుడు ఉక్రెయిన్ సైనికులు ఆ పాటకు స్టెప్పులు వేశారు.

ఎలాగైతే ఆ మూవీలో ఇద్దరు నటులు బ్రిటీస్‌ వారికి వ్యతిరేకంగా ఎలా డ్యాన్స్‌ని ప్రదర్శించారో అలానే ఇద్దరు ఉక్రెయిన్‌ సైనికులు చేసి అందర్నీ అలరించారు. ఈ పాటతో ఆ నటులిద్దరు బ్రిటిష్‌ అధికారికి వ్యతిరేకంగా ఎలా అయితే తమ నిరసనను వ్యక్తం చేశారో అలా రష్యాకి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆపాటను చిత్రీకరించింది ఉక్రెయిన్‌ ఆర్మీ. అదీకూడా సరిగ్గా ఆర్‌ఆర్‌మూవీ నాటు నాటు పాటను ఎక్కడైతే షూట్‌ చేశారో అక్కడే(జెలెన్‌స్కీ అధికారిక నివాసం ఎదుట)  ఆప్రదేశంలోనే ఉక్రెయిన్‌ సైనికులు కూడా తమ వీడియోని చిత్రీకరించారు. 

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో ఉక్రెయిన్‌ నెటిజన్లు మేము మా స్వంత వలసవాదులతో పోరాడుతున్నాం. ఉక్రెయిన్‌ స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉందని రష్యాకు మరోసారి అర్థమయ్యేలా చేస్తాం అని ఒకరు, యుద్ధం వేళ ఈ పాట అనుకరణగా అద్భతంగా ఉందని మరోకరు ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అధికార ఖాతా కూడా ఈ వీడియోకి ఫోల్డింగ్‌ హ్యాండ్స్‌ ఎమోజీలను పెట్టడమే గకా వీడియోని రీట్వీట్‌ చేసింది. అంతేగాదు ఈ వీడియోకి ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్‌ హ్యారీ)
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top