టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్‌కు బలం తోడైంది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్‌ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుకు యూకే కదిలి వచ్చింది. ప్రమాదకరమైన ఆయుధ సంపత్తితో యూకే యుద్ధనౌక హర్మూజ్ జలసంధిలో వాలిపోయింది.
ఈ క్రమంలో న్యూక్లియర్ పవర్డ్ బ్రిటిష్ సబ్‌మెరైన్ ‘హెచ్‌ఎంఎస్ ఆన్సన్’హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. ఇది ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పిడోలు, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉంది. ఇరాన్‌పై సైనిక చర్యలను తీవ్రతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తున్న తరుణంలో యూకే సబ్ మెరైన్ హర్మూజ్ జలసంధిలో మోహరించడం విశేషం. తాజా పరిణామంతో ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్‌కు మరింత బలం చేకూరినట్లువుతుంది.
ఈ నౌక మార్చి 6న ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుండి బయల్దేరిన యూకే సబ్‌మెరైన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉత్తర అరేబియా సముద్రంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉండదనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
అధునాతన ఆయుధాలతో కూడిన హెచ్‌ఎంఎస్ ఆన్సన్ నౌకలో 1,600 కిలోమీటర్ల పరిధి గల ‘టోమాహాక్ బ్లాక్ ఐవీ భూతల దాడి క్షిపణులు’, స్పియర్‌ఫిష్ హెవీవెయిట్ టార్పెడోలు’ అమర్చబడి ఉన్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద పహారా కాస్తున్న ఇరాన్ యుద్ధనౌకలు దాడికి తెగబడితే.. వాటిని అరికట్టేందుకు ఇరాన్ మోహరించిన క్షిపణి స్థావరాలపై శక్తివంతమైన దాడులు చేసేందుకు వీలు కలగనున్నాయి.
సీఎన్ఎన్ ప్రకారం.. హర్మూజ్ జలసంధిలోని నౌకలపై జరిగే దాడులతో సంబంధం ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఈ యూకే సబ్‌మెరైన్ ఉపయోగపడనుంది. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్‌కు మిత్రదేశాలు బలం చేకూరుస్తున్నాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీతో పాటు మరో ఆరు దేశాలు హర్మూజ్ జలసంధిలో భద్రత కోసం ముందుకు వచ్చాయి.


