ఫ్రిజ్‌లో ఎలా కూర్చున్నాడబ్బా?!

Twitter User Photoshops Himself Inside A Refrigerator - Sakshi

ఫోటోషాప్‌ మాయాజాలం.. వైరలవుతోన్న ఫోటోలు

జెరూసలేం: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది. నోరెళ్లబెట్టే ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన ఫోటోలు కొన్ని తాజాగా సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని పోస్ట్‌ చేసిన వ్యక్తి సృజనాత్మకతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు జనాలు. ఇంతకు ఆ ఫోటోల్లో ఏం ఉందో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

పాలస్తీనాకు చెందిన సాయిద్‌ అనే యువకుడికి ప్లేన్‌గా, సాధారణంగా ఉన్న తన ఫ్రిజ్‌ స్క్రీన్‌ చూసిన ప్రతి సారి బోర్‌గా అనిపించేది. ఈ క్రమంలో ఓ రోజు సాయిద్‌ తన ఫ్రిజ్‌ను అందంగా మార్చాలని భావించాడు. ఇందు కోసం తనకు ఎంతో ప్రావీణ్యం ఉన్న ఫోటోషాప్‌ని ఉపయోగించుకున్నాడు. ఇక తన ప్రతిభతో అద్భుతాలను సృష్టించాడు. 

సాయిద్‌ ఎలాంటి ఫోటోలు తీశాడంటే.. సడెన్‌గా వీటిని చూసిన వారంతా.. నిజంగా అతడు ఫ్రిజ్‌ లోపల కూర్చాన్నాడేమో అనుకుంటారు. ఇలా తీసిన ఫోటోలని సాయిద్‌ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అయితే అనూహ్య రీతిలో వీటికి భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోటోలని 73,700 మంది రీట్వీట్‌ చేయగా.. 7,29,600కుపైగా లైకులు వచ్చాయి. 

చదవండి:

‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top