‘ఆంక్షలను తొలగించబోతున్నా.. మీకు సంతోషమేనా?’ | Trump Says Will Lift Sanctions On Turkiye | Sakshi
Sakshi News home page

‘ఆంక్షలను తొలగించబోతున్నా.. మీకు సంతోషమేనా?’

Jul 8 2026 7:45 AM | Updated on Jul 8 2026 7:51 AM

Trump Says Will Lift Sanctions On Turkiye

అంకారా: రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసినందుకు గాను గతంలో తుర్కియేపై విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రకటించారు. ట్రంప్‌ ప్రకటనతో ఆ దేశం అమెరికా నుంచి ఎఫ్‌–35 ఫైటర్‌ జెట్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.

అంకారాలో మంగళవారం తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్‌.. ‘ఆంక్షలను తొలగించబోతున్నా, మీకు సంతోషమేనా?’అంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై తమ అధికారులు తగు చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. అమెరికాఎఫ్‌–35 యుద్ధ విమానాల ప్రోగ్రామ్‌లోకి తుర్కియే తిరిగి ప్రవేశించడానికి ఇంకా అడ్డంకులు అనేకం ఉన్నప్పటికీ ’కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్సరీస్‌ త్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌’ (కాట్సా) కింద విధించిన ఆంక్షలను తొలగించడంతో ఆ విమానాలను దక్కించుకోవడానికి తుర్కియేకు మార్గం సులువు కానుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement