Thailand Monkey Festival: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!

Thailand Monkey Festival: Thousands Of Monkeys In Lopburi Enjoyed With Fruits, Vegetables - Sakshi

Thailand Monkey Festival: : కొన్ని దేశాల్లో చాలా వింతైన పండుగలు జరుగుతుంటాయి. పైగా  ఆ పండుగలను భారీ ఖర్చుతో అంగరంగ వైభవోపేతంగా జరుపుతారు. చూడటానికి కాస్త విడ్డూరంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. అచ్చం అలాంటి పండుగే ఒకటి థాయ్‌లాండ్‌ దేశంలో అట్టహాసంగా జరుగుతోంది.

(చదవండి: ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!)

అసలు విషయంలోకెళ్లితే.. థాయ్‌లాండ్‌లోని ప్రజలు కోతుల పండుగను అత్యంత అట్టహాసంగానూ, ఆహ్లాదభరితంగానూ నిర్వహిస్తారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల విరామం తర్వాత సెంట్రల్‌ థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి పట్టణంలో ఈ పండుగ తిరిగి ప్రారంభమైంది. అంతేకాదు ఈపండుగలో వేలాది కోతులు రెండు టన్నుల  అరటిపండ్లు, పైనాపిల్‌ పళ్లను తింటూ, గెంతుతూ అక్కడ ఉన్న పళ్ల కుప్ప పైకి ఎక్కి కూర్చుంటూ ఆనందంగా ఆరగిస్తాయి. అంతేకాదు ఈ పండుగకు సుమారు రూ 3 వేల డాలర్లు అంటే (దాదాపు రూ. 2లక్షలు) వరకు ఖర్చు పెట్టి మరి  ఆకోతులకు ఘనంగా విందు నిర్వహిస్తారు.

అయితే ఈ పండుగను ఎందుకు చేస్తారంటే పర్యాటక దేశం అయిన థాయ్‌లాండ్‌ని ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడంలో తమ వంతుగా సహకరిస్తున్న స్థానిక కోతులకు ధన్యావాదాలు చెప్పే నిమిత్తం ఈ పండుగను నిర్వహిస్తారు. ఇది థాయ్‌లాండ్‌ వార్షిక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పండుగను "మంకీ ప్రావిన్స్" అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది పండుగ థీమ్‌ ఏంటంటే వీల్‌ చైర్‌ కోతులు. ఈ థీమ్‌  ముఖ్యోద్దేశం ఏంటంటే థాయ్‌లాండ్‌లోని యోంగ్యుత్‌ పేద ప్రజలకు సుమారు వంద వీల్‌ చైర్‌లను విరాళంగా ఇవ్వడం.

అంతేకాదు నవంబర్‌లో వ్యాక్సినేషన్‌ తీసుకున్న పర్యాటకుల కోసం నిర్భందరహిత పర్యాటక పథకాన్ని ప్రారంభిన నేపథ్యంలో మళ్లీ గతంలో మాదిరిగా పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. అయితే అక్కడ ఉన్న కొందరు పర్యాటకులు తమ కెమెరాలతో కోతులతో ఆడుకుంటూ కనిపించారు. ఈ మేరకు ఈ సంప్రదాయం మళ్లీ తిరిగి ప్రారంభం కావడం పట్ల అక్కడ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు రెండేళ్ళ తర్వాత  కోతులు ఈ విధంగా అన్ని రకాల పండ్లు, కూరగాయలను తినడం ఇదే మొదటిసారి అని అక్కడ స్థానికుడు థనిడా ఫుడ్జీబ్ చెప్పారు. 

(చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top