Taliban: అజ్ఞాతం వీడిన తాలిబన్‌ చీఫ్‌, 10 నిమిషాల ఆడియో? | Taliban Chief Haibatullah Akhundzada Makes Public Appearance Amid Death Rumours | Sakshi
Sakshi News home page

Afghanistan: అజ్ఞాతం వీడిన తాలిబన్‌ చీఫ్‌, 10 నిమిషాల ఆడియో?

Nov 1 2021 5:43 AM | Updated on Nov 1 2021 3:37 PM

Taliban Chief Haibatullah Akhundzada Makes Public Appearance Amid Death Rumours - Sakshi

తాలిబన్ల చీఫ్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా (ఫైల్‌ ఫొటో)

అయితే అఖుంద్‌జాదా పర్యటన వీడియోలు, ఫోటోలేవీ బయటపెట్టలేదు. అతను మాట్లాడినట్టుగా భావిస్తున్న 10 నిమిషాల ఆడియోను మాత్రం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకొని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత  తాలిబన్ల చీఫ్‌ హైబతుల్లా అఖుంద్‌జాదా తొలిసారిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అఖుంద్‌జాదా అజ్ఞాతం వీడకపోవడంతో అతను మరణించాడని వదంతులు మొదలయ్యాయి. వీటికి తెరదించుతూ తమ నేత కాందహార్‌లోని  జామై దరూల్‌ అలూమ్‌ హకీమియా మదర్సాను సందర్శించినట్లు తాలిబన్లు తెలిపారు.

అయితే అఖుంద్‌జాదా పర్యటన వీడియోలు, ఫోటోలేవీ బయటపెట్టలేదు. అతను మాట్లాడినట్టుగా భావిస్తున్న 10 నిమిషాల ఆడియోను మాత్రం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అందులో అఖుంద్‌జాదా మతపరమైన బోధనలు మాత్రమే చేస్తున్నాడు.  అయితే తాలిబన్‌ నాయకత్వానికి అల్లా దీవెనలు ఉండాలని చెబుతున్నాడు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేసిన పోరాటంలో మరణించిన తాలిబన్ల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశాడు. 2016 అమెరికా డ్రోన్‌ దాడుల్లో అప్పటి తాలిబన్‌ చీఫ్‌ ముల్లా అఖ్తర్‌ మన్సూర్‌ హతం అయ్యాక అఖుంద్‌జాదా తాలిబన్లకు చీఫ్‌ అయ్యాడు.  
(చదవండి: ఫిజిక్స్‌లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement