2021 Nobel Prize: భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతి విజేతలు వీరే..!

Syukuro Manabe Klaus Hasselmann Giorgio Parisi Win 2021 Nobel Prize In Physics - Sakshi

వాషింగ్టన్‌: మెడిసిన్‌ విభాగంలో 2021 గాను డాక్టర్‌ డేవిడ్‌ జూలియస్‌, డా. అరర్డెం పటాపౌషియన్‌లకు ఉమ్మడిగా నోబెల్‌ బహుమతిని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది గాను భౌతిక శాస్త్ర విభాగంలో చేసిన కృషికిగాను సైకురో మనాబే, క్లాస్ హస్సెల్మాన్, జార్జియో పారిసిలకు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి వరించింది.
చదవండి: నోబెల్‌ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు

అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో సైకూరే మనాబే  సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు భూఉపరితలంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఎలా దారితీస్తాయనే విషయంపై చేసిన పరిశోధనకుగాను నోబెల్‌ బహుమతి వరించింది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెటరాలజీ యూనివర్సీటిలో  ప్రొఫెసర్ క్లాస్ హస్సెల్మాన్ పనిచేస్తున్నారు. వెదర్‌ అండ్‌ క్లైమెట్‌కు సంబంధించిన మోడల్‌ను రూపొందించినందుకుగాను నోబెల్‌ బహుమతి లభించింది. రోమ్‌లోని సపియెంజా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జియోర్జియో పారిసికి, అస్తవ్యస్తమైన సంక్లిష్ట పదార్థాలలో దాచిన నమూనాలను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి వరించింది.  సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంతానికి అతని ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి. 

చదవండి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top