ఆర్ధికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి | Three People Won The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 2025 | Sakshi
Sakshi News home page

ఆర్ధికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

Oct 13 2025 3:09 PM | Updated on Oct 13 2025 5:10 PM

Three People Won The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 2025

స్టాక్‌హోమ్: ఆర్థిక శాసస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి వరించింది. జోయెల్‌ మోకిర్‌, ఫీటర్‌ హౌవీట్‌, ఫిలిప్‌ అఘియన్‌లు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్‌ బహుమతి దక్కించుకున్నారు.  

ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధిపై పరిశోధనకు ముగ్గురికి ఆర్థిక శాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది. అమెరికా నుంచిఓయెల్ మోకిర్, ఫ్రాన్స్‌ నుంచి ఫిలిప్ అఘియోన్, కెనడా నుంచి పీటర్ హోవిట్‌లకు 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని సంయుక్తంగా పొందారు.

సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు జోయెల్‌ మోకిర్‌కు నోబెల్‌ బహుమతిలో సగం బహుమతిని.. మిగిలిన భాగాన్ని మిగిలిన ఇద్దరు ఫీటర్‌ హౌవీట్‌, ఫిలిప్‌ అఘియన్‌ దక్కింది. తద్వారా నోబెల్‌ బహుమతి పొందిన వారికి అందించే నగదును నోబెల్‌ ఫౌండేషన్‌ సభ్యులు అందించనున్నారు. 

ఆవిష్కరణల ప్రాధాన్యత: ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆవిష్కరణల ద్వారానే దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని నిరూపించారు.

సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు: ప్రభుత్వాలు పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెంచితే, ఆవిష్కరణలు వేగంగా జరుగుతాయని వీరి అధ్యయనం సూచించింది.

వ్యవస్థాపక మార్పులు: మార్కెట్ పోటీ, మేధో సంపత్తి హక్కులు, విద్యా వ్యవస్థల బలోపేతం వంటి అంశాలు ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని వీరు వివరించారు.

ప్రపంచ ఆర్థిక విధానాలపై ప్రభావం: ఓఈసీడీ, ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ పరిశోధనల ఆధారంగా తమ విధానాలను మలచుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది మార్గదర్శకంగా నిలుస్తోంది

 ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

ఈ సందర్భంగా నోబెల్‌ ఫౌండేషన్‌ కమిటీ మాట్లాడుతూ.. విష్కరణల ప్రేరణతో ఆర్థిక వృద్ధిని సాధించగలమన్న సిద్ధాంతాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా నిరూపించారు. ఇది ఆర్థిక విధానాల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుంది’.

ఆర్థిక శాస్త్రంలో మేటి పరిశోధనలకు అత్యున్నత గౌరవమిచ్చే నోబెల్‌ బహుమతుల ప్రకటనను నోబెల్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. కాగా, ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలందరి దృష్టి ‘స్వీడిష్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్’పైనే ఉంది. ఆరు రంగాల్లో విశిష్టమైన సేవలందించినందుకు గాను నోబెల్‌ ఫౌండేషన్‌ ప్రకటించే నోబెల్‌ బహుమతుల్లో ఆర్థిక శాస్త్రంలో పొందే నోబెల్‌ బహుమతికి అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం..ఆర్ధిక శాసస్త్రంలో నోబెల్‌ బహుమతి ఎవరికి దక్కిందనేది సోమవారం మధ్యాహ్నం 3.15గంటలకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుతులు పొందిన ముగ్గురి వివరాలను నోబెల్‌ ఫౌండేషన్‌ సభ్యులు వెల్లడించారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement