లంకలో షూట్‌ ఎట్‌ సైట్‌ ఆదేశాలు

Srilanka Defence Ministry Explained Three Step Shoot At Sight Orders - Sakshi

Sri Lanka's Secretary to the Defence Ministry clarified: శ్రీలంకలోని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఘోరమైన హింసాకాండకు దారితీసింది. నెలలు తరబడి సాగుతున్న అల్లర్లు కాస్తా హింసాత్మకంగా మారిపోతున్నాయి. తొలుత శాంతియుతంగా నిరసనలు చేస్తున్నవారిపై రాజపక్స కుటుంబ సభ్యులు దాడి చేయడంతోనే పరిస్థితి మరింత తీవ్రతరంగా మారింది. దీంతో శ్రీలంక అధికారులు మంగళవారం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు షూట్‌ఎట్‌సైట్‌ ఆర్డర్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు  శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖ సెక్రటరీ జనరల్‌ జీడీహెచ్‌ కమల్‌ గుణరత్నే అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందో వివరించారు.

ఆయన మాట్లాడుతూ..."తొలుత పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కట్టుది‍ట్టమైన కర్ఫ్యూను విధించినప్పటికీ వాటన్నింటిని ఉల్లంఘించి మరీ హింసకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.  ఘోరమైన హింసకు పాల్పడినవారందరూ లంకేయులే. మా సొంత వ్యక్తుల పై కాల్పులు జరపడం ఇష్టం లేదు. అయితే తాము మొదటగా నిరసనకారులను చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరుపుతాం. అయినప్పటికీ వినకపోతే పోలీసులు వారి మోకాళ్ల పై కాల్పులు జరుపుతారు.

ఇక అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే సైన్యం రంగంలోకి దిగుతుంది. అయినా శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్స మంచి నాయకుడు. ఇప్పుడు ఆయనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రక్షణ కల్పించకూడదని అర్థం కాదు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఏ మాజీ ప్రెసిడెంట్‌కైనా అతని మరణం వరకు భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తాయి. మా రక్షణ బృందం అమాయకులపై ఎప్పటికీ కాల్పులు జరపదు. అని అన్నారు.

(చదవండి: లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్! ఆ గంటలో జరిగింది ఇదే..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top