దక్షిణ కొరియాలో నేడే ఎన్నికలు  | South Korea goes to the polls to elect new president after Yoon crisis | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియాలో నేడే ఎన్నికలు 

Jun 3 2025 4:34 AM | Updated on Jun 3 2025 4:34 AM

South Korea goes to the polls to elect new president after Yoon crisis

విపక్ష అభ్యర్థి మ్యుంగ్‌కే అధ్యక్ష పీఠం!

సియోల్‌: నెలల తరబడి కొనసాగిన రాజకీయ సంక్షోభం అనంతరం దక్షిణ కొరియాలో మంగళవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. గత డిసెంబర్‌లో మార్షల్‌ విధించి పరువుతో పాటు అంతిమంగా పదవి కూడా కోల్పోయిన యూన్‌ సుక్‌ యెల్‌ స్థానంలో 4.4 కోట్ల మంది ఓటర్లు నూతన అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. 

ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ అధికార పీపుల్‌ పవర్‌ పార్టీ అభ్యర్థి కిమ్‌ మూన్‌ సూ, విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ కొరియా పారీ్టకి చెందిన లీ జే మ్యుంగ్‌ మధ్యే నెలకొంది. 

వారు తొలుత నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డా, మ్యుంగ్‌ క్రమంగా పై చేయి సాధించారు. దీనికి తోడు తాజా మాజీ అధ్యక్షుని ఏకపక్ష పోకడలను విమర్శించేందుకు సూ నిరాకరించడంతో ఆయన గ్రాఫ్‌ బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో 61 ఏళ్ల మ్యుంగ్‌ భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాలు వెలువడి నూతన అధ్యక్షుడు బుధవారమే బాధ్యతలు చేపడతారు.
 

Advertisement
 
Advertisement
Advertisement