ఫిజీ ప్రధానిగా రబుకా | Sitiveni Rabuka Becomes Fiji New Prime Minister | Sakshi
Sakshi News home page

ఫిజీ ప్రధానిగా రబుకా

Dec 25 2022 6:24 AM | Updated on Dec 25 2022 6:24 AM

Sitiveni Rabuka Becomes Fiji New Prime Minister - Sakshi

మెల్‌బోర్న్‌: ఫిజీ ప్రధానిగా మాజీ మిలటరీ కమాండర్‌ సిటివెని రబుకా (74) శనివారం ప్రమాణం చేశారు. పీపుల్స్‌ అలయెన్స్‌ పార్టీకి చెందిన ఆయన మరో రెండు పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 14వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు.

16 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న ఫ్రాంక్‌ బైనిమరామ వైదొలిగేందుకు నిరాకరించడంతో ఉత్కంఠ కొనసాగింది. పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంలో రబుకా ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఫిజీలో గత 35 ఏళ్లలో నాలుగుసార్లు సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement