ఎయిర్‌లైన్స్‌లో కొత్త రూల్‌! గర్భిణి క్యాబిన్‌ సిబ్బంది కూడా...

Singapore Airlines Ltd Pregnant Cabin Crew Choose Ground Attachment - Sakshi

ఎయిర్‌లైన్స్‌ గర్భిణి క్యాబిన్‌ సిబ్బందిని విధుల నుంచి తొలగించనని చెబుతుంది. వారు ఉద్యోగం కొనసాగించేలా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా ఇచ్చింది. అంతేగాదు డెలిరీ అయినా తర్వాత కూడా యథావిధిగా ఉద్యోగాన్ని కొనసాగించవచ్చని కూడా స్పష్టం చేసింది.  గత కొంతకాలంగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌పై పలు విమర్శులు ఉన్నాయి. లింగ సమానత్వం పాటించడం లేదని గర్భిణి క్యాబిన్‌ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.

అంతేగాదు వారిని ప్రెగ్నెన్సీ సమయంలో బలవంతంగా వేతనం లేని సెలవుల్లో ఉంచి, తదనంతర డెలివరీ తర్వాత పిల్లల బర్త్‌ సర్టిఫికేట్‌ తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తుంది. దీనిపై సర్వత్ర విమర్శలు రావడంతో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ కొత్త రూల్‌ని అమలు చేయనుంది. ఇక నుంచి గర్భణి క్యాబిన్‌ సిబ్బందిని తొలగించమని చెబుతోంది. అంతేగాదు గర్భిణి క్యాబిన్‌ సిబ్బంది తాత్కాలికంగా గ్రౌండ్‌ అటాంచ్‌మెంట్‌ పని చేసుకోవచ్చని, ప్రశూతి సెలవుల అనంతరం తిరిగి విధులు నిర్వర్తించ వచ్చని పేర్కొంది.

ఈ మహమ్మారి కారణంగా సిబ్బంది కొరత సమస్యను ఎదుర్కొనడంతో ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ గర్భిణి సిబ్బంది మూడు నుంచి తొమ్మిది నెలలు గ్రౌండ్‌ ప్లేస్‌మెంట్‌లో విధులు నిర్వర్తించవచ్చు అని తెలిపింది. అలాగే ప్రతిభావంతులైన తమ సిబ్బందిని వదులుకోమని కూడా పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొరిన్నా లిమ్ ప్రసవానంతరం తల్లులు విమాన ప్రయాణం చేయకుండా మరైదైన బాధ్యతలు అప్పగించే అవకాశం లేదా అని ప్రశ్నించారు. అంతేగాదు ఈ కొత్త రూల్‌ కచ్చితంగా అమలవుతుందా అని కూడా ఎయిర్‌లైన్స్‌ని నిలదీశారు. ఐతే సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ విషయంపై ఇంకా స్పందించ లేదు. 

(చదవండి: కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top