
కీవ్: ఉక్రెయిన్ తరఫున శాంతి చర్చల్లో పాల్గొన్న డెనిస్ కిరీవ్‌ని ఆ దేశ సీక్రెట్ సర్వీస్ కాల్చి చంపింది. కిరీవ్ ఒక గూఢచారి అని, అరెస్టుకు సహకరించకపోవడంతో చంపాల్సి వచ్చిందని పార్లమెంట్ సభ్యులు తెలిపారు.
రక్షణ శాఖ మాత్రం ఆయన్ను మరణానంతరం హీరోగా కీర్తించడం విశేషం! గత వారం రష్యాతో జరిగిన చర్చల్లో కిరీవ్ ఉక్రెయిన్ పక్షాన పాల్గొన్నారు. అయితే ఆయన పేరు అధికారిక బృందంలో లేదు. చర్చల్లో ఆయన పాత్రపై స్పష్టత లేదు. కిరీవ్ మీ గూఢచారి అంటే, మీ వాడేనని రష్యా, ఉక్రెయిన్ ఆరోపణలు చేసుకున్నాయి. ఇక్కడ కన్ఫ్యూజన్‌లో పడిన ఉక్రెయిన్ మధ్యవర్తిగా వ్యవహరించిన కిరీవ్‌ను చంపేసింది.