ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి

Russia Ukraine War: Indian Student Dies In Ukraine Illness - Sakshi

ఉక్రెయిన్‌ సంక్షోభం మరింత తీవ్రతరం కావడంతో అక్కడ ఉన్న భారతీయులను తరలింపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే దురదృష్టవశాత్తు మంగళవారం ఖార్కివ్‌లో రష్యన్ షెల్లింగ్‌లో మెడిసిన్‌ విద్యార్థి నవీన్‌ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వివరాల ప్రకారం.. 21 ఏళ్ల చందన్ జిందాల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు. అతను పంజాబ్‌లోని బుర్నాలాకు చెందినవాడు. అయితే ఇసెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతోన్న చందన్ జిందాల్‌ను ఫిబ్రవరి 2న వినిట్సియాలోని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో భారత్‌లో ఉంటున్న చందన్‌ తల్లిదండ్రులు ఫిబ్రవరి 7న ఉక్రెయిన్‌ చేరుకున్నారు.  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చందన్‌కు అకస్మాత్తుగా బ్రెయిన్‌ స్ట్రోక్ రావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆరోగ్యం క్షీణించిన కారణంగా చందన్ మరణించినట్లు మంగళవారం వైద్య అధికారలు తెలిపారు.

(చదవండి: Russia-Ukraine War: రష్యాకు సపోర్ట్‌.. బెలారస్‌కు బిగ్‌ షాక్‌ )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top