మాస్కోలో  అట్టహాసంగా  విక్టరీ డే  | Russia exudes confidence at parade marking 80 years since Nazi defeat | Sakshi
Sakshi News home page

మాస్కోలో  అట్టహాసంగా  విక్టరీ డే 

May 10 2025 4:53 AM | Updated on May 10 2025 4:53 AM

Russia exudes confidence at parade marking 80 years since Nazi defeat

మాస్కో: నాజీ జర్మనీపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ రష్యా శుక్రవారం 80వ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంది. మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో జరిగిన భారీ పరేడ్‌లో అధ్యక్షుడు పుతిన్‌తోపాటు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డ సిల్వా తదితరులు పాల్గొన్నారు. సుమారు 11,500 బలగాలు, ట్యాంకులు, శతఘ్ని వాహనాలు తదితర 180కి పైగా మిలటరీ వాహనాలు పరేడ్‌లో పాల్గొన్నాయి.

 ఖండాంతర అణు బాలిస్టిక్‌ క్షిపణులతో కూడిన యార్స్‌ లాంఛర్లు రెడ్‌ స్క్వేర్‌ పరేడ్‌లో ప్రత్యేకార్షణగా మారాయి. గగనతలంలో యుద్ధ విమానాలు చేసిన ఏరోబిక్‌ విన్యాసాలు ఆహూతులను అలరించాయి. నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యు ద్ధంతో ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు, మిత్ర దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు పుతిన్‌ ఈ కార్యక్రమాన్ని వేదికగా మార్చుకున్నారని పరిశీలకులు అంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement