breaking news
President Putin
-
మాస్కోలో అట్టహాసంగా విక్టరీ డే
మాస్కో: నాజీ జర్మనీపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ రష్యా శుక్రవారం 80వ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగిన భారీ పరేడ్‌లో అధ్యక్షుడు పుతిన్‌తోపాటు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా తదితరులు పాల్గొన్నారు. సుమారు 11,500 బలగాలు, ట్యాంకులు, శతఘ్ని వాహనాలు తదితర 180కి పైగా మిలటరీ వాహనాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. ఖండాంతర అణు బాలిస్టిక్ క్షిపణులతో కూడిన యార్స్ లాంఛర్లు రెడ్ స్క్వేర్ పరేడ్‌లో ప్రత్యేకార్షణగా మారాయి. గగనతలంలో యుద్ధ విమానాలు చేసిన ఏరోబిక్ విన్యాసాలు ఆహూతులను అలరించాయి. నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యు ద్ధంతో ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు, మిత్ర దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు పుతిన్ ఈ కార్యక్రమాన్ని వేదికగా మార్చుకున్నారని పరిశీలకులు అంటున్నారు. -
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
-
రష్యా క్షిపణే ఆ విమానాన్ని కూల్చేసింది!
పుతిన్ బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందే మలేషియా విమానం ఎంహెచ్-17 కూల్చివేత వ్యవహారంలో రష్యా ప్రభుత్వం, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఓ ఆస్ట్రేలియా న్యాయసేవల సంస్థ కోర్టుకు ఈడ్చింది. ఈ ప్రమాదంలో బాధితుల కుటుంబాలకు రష్యా, పుతిన్ పరిహారం చెల్లించాలంటూ మానవహక్కుల యూరోపియన్ కోర్టులో దావా వేసింది. 2014, జూలై 17న దక్షిణాఫ్రికాలోని అమ్‌స్టర్‌డాం నుంచి కౌలాలంపుర్ వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 298 మంది చనిపోయారు. ఇందులో 28మంది ఆస్ట్రేలియన్లు. ఈ విమానాన్ని కూల్చేసిన భూ-గగనతల క్షిపణి రష్యాలో తయారయినదని డచ్ సెఫ్టీ బోర్డు తన దర్యాప్తు నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాకు చెందిన బాధిత కుటుంబాల తరఫున సిడ్నీకి చెందిన ఎల్‌హెచ్‌డీ లాయర్స్ సంస్థ యూరోపియన్ కోర్టులో దావా వేసింది. చనిపోయిన ప్రతి బాధితుడి కుటుంబానికి రూ. 67.42 కోట్ల పరిహారం చొప్పున రష్యా చెల్లించాలని డిమాండ్ చేసింది.