ట్రంప్‌ కోసం రష్యా ప్రయత్నాలు | Russia Continues to Meddle in Election to Aid Trump, US Intelligence | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కోసం రష్యా ప్రయత్నాలు

Aug 9 2020 3:52 AM | Updated on Aug 9 2020 1:19 PM

Russia Continues to Meddle in Election to Aid Trump, US Intelligence - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు వ్యతిరేకంగా రష్యా కుట్ర చేస్తోందని అమెరికా నిఘా అధికారులు పేర్కొన్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అనుకూలంగా రష్యాతో సన్నిహిత సంబంధాలున్న కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు.  అయితే, చైనా మాత్రం ట్రంప్‌ మరోసారి ఎన్నిక కాకూడదని కోరుకుంటోందని తెలిపారు. ఆ దిశగా ప్రజాభిప్రాయం మార్చేందుకు చైనా ట్రంప్‌పై విమర్శల పదును పెంచిందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement