ప్లీజ్‌.. నా భర్త మృతదేహాన్ని భారత్‌కు పంపించండి | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. నా భర్త మృతదేహాన్ని భారత్‌కు పంపించండి

Published Wed, Dec 6 2023 6:15 PM

Road Accident In Australia Wife Seeks Help To Repatriate His Remains - Sakshi

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో రోడ్డు ప్రమాదానికి గురై భారతదేశానికి చెందిన ఖుష్‌దీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. తన భర్త మృతదేహాన్ని భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులకు దగ్గరికి చేర్చడానికి అతని భార్య జప్నీత్ కౌర్‌ హార్థిక ఇబ్బందులు పడుతున్నారు. తన భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకువెళ్లడానికి సాయం అందించాలని కోరుతోంది. వివరాళ్లోకి వెళ్లితే..

26 ఏళ్ల ఖుష్‌దీప్‌.. మెల్‌బోర్న్‌లో ట్రక్‌ డ్రైవర్‌. సోమవారం రాత్రి ఖుష్‌దీప్‌ ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స  పొందుతూ మృతి చెందాడు. 

అయితే తన భార్త మృతదేహాన్ని స్వదేశంలో ఉన్న అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్తప్తి చేశారు. అదే విధంగా ఈ విషయం తెలుసుకున్న ఓ భారతీ విద్యార్థి GoFundMe ద్వారా నిధులను సేకరిస్తున్నాడు. ఆమె చదువు నిమిత్తం గత ఏడాది ఆస్ట్రేలియా వచ్చి భర్తతో కలిసి ఉంటున్నారు.

Advertisement
 
Advertisement