ఆస్తుల వెల్లడిలో రిషి సునక్‌పై పలు అనుమానాలు

Rishi Sunak Family Wealth Not Declared Ministerial Register - Sakshi

భార్య, ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదు

లండన్‌: ఇటీవల బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా నియమితులైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ (39) ఆర్థిక వ్యవహారల పారదర్శకతపై పలు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. గార్డియన్‌ ప్రకారం రిషి సునక్‌ భార్య, అతడి కుటుంబ సభ్యులు పలు కంపెనీల్లో మల్టీమిలియన్‌ పౌండ్ల విలువజేసే షేర్‌హోల్డింగ్స్‌, డైరెక్టర్‌షిప్స్‌ కలిగి ఉన్నారని.. కానీ వాటి గురించి ఆయన అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. ఇక గార్డియన్‌ ప్రచురించిన మరో ప్రత్యేక కథనం ప్రకారం రిషి సునక్‌ భార్య అక్షత మూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. ఆ కంపెనీలో అక్షత పేరు మీద 430 మిలియన్‌ పౌండ్లు విలువ చేసే షేర్లు ఉన్నాయి. దీని ప్రకారం చూసుకుంటే.. ఆమె బ్రిటన్‌లో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలుస్తారు.  ఆమె క్వీన్‌ ఎలిజబెత్‌ కన్నా ధనవంతురాలిగా ఉండనున్నట్లు గార్డియన్‌ తెలిపింది. ( నాకలాంటి కోరికేదీ లేదు : రిషి సునక్ )

ఇక బ్రిటన్‌ మంత్రివర్గ నియమావళి ప్రకారం సునక్‌ తనకు సంబంధించిన ఆర్థిక విషయాలను ప్రజలకు వెల్లడించడం అతడి బాధ్యత. మినిస్టీరియల్‌ రిజిస్టర్‌ ప్రకారం మంత్రులు తమ కుటుంబం ఆధీనంలో ఉన్న ఆస్తుల గురించి అంటే తోబుట్టువులు, తల్లిదండ్రులు, భార్య, అత్యమామల పేర్ల మీద ఉన్న ఆస్తుల గురించి వెల్లడించడం తప్పనిసరి. అయితే సునక్‌ మాత్రం అతడి భార్య మినహా ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులను వెల్లడించలేదు. అంతేకాక తాను ఓ చిన్న యూకే ఆధారిత వెంచరల్‌ క్యాపిటల్‌ కంపెనీకి యాజమానిగా మాత్రమే ప్రకటించుకున్నారు. దాంతో ప్రస్తుతం రిషి సునక్‌ ఆర్థిక వ్యవహారాల గురించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top