ఇంటర్వ్యూలో అన్నీ కరెక్ట్‌గా చెప్పినా.. ఆ సిల్లి కారణంతో రిజెక్ట్‌ చేశారు

Recruiter Rejected Women Candidates Job She Isnt Slim Uk Goes Viral - Sakshi

సాధారణంగా ఉద్యోగులను ఎంపిక చేసుకునేటప్పుడు హెచ్‌ఆర్‌లు తాము ఎంపిక చేయబోయే అభ్యర్థులకు కొన్ని అర్హతలు నిర్ణయించుకుంటారు. వాటిని అనుసరించే ఆ ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలో అభ్యర్థులు ఇంటర్యూ సమయంలో చెప్పిన సమాధానాలను మరికొన్ని వాటిని పోల్చి చూసుకుని వారిని ఎంపిక చేయాలా, వద్దా అనేది తేలస్తారు రిక్రూటర్లు. కానీ ఓ యువతి ఒక వింత కారణం చెప్పి రిజెక్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న యూకేలో చోటు చేసుకుంది. ఈ సిల్లీ రీజ‌న్ చెప్పి ఉద్యోగానికి రిజెక్ట్ చేసిన ఘ‌ట‌న తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

ప్రాప‌ర్టీ రిక్రూట్‌మెంట్ సంస్థ డైరెక్టర్‌ ఫాయె ఏంజెలెట్టా త‌న క్లయింట్ కంపెనీలో ఓ ఉద్యోగం కోసం ఇంట‌ర్వ్యూలు తీసుకుంది. అందులో ఒక యువ‌తిని ఎంపిక చేసింది. ఎంపిక చేసిన ఆ యువతి బయోడేటాను సదరు క్లయింట్‌కు పంపించింది. అయితే.. వాళ్లు మాత్రం ఆ యువ‌తి లావుగా ఉంద‌నే కారణంతో రిజెక్ట్ చేశారు. ఆ యువతిని ఎందుకు రిజెక్ట్ చేశారో కార‌ణం చూసి ఏంజెలెట్టా షాక్ అవుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

అందులో.. తను లావుగా ఉంద‌ని.. ఉద్యోగంలోకి తీసుకోక‌పోవ‌డం అసలు కారణమే కాదు. ఇంతవరకు నేను ఇలాంటి కార‌ణాల‌తో ఉద్యోగుల‌ను రిజెక్ట్ చేయ‌డం చూడ‌లేదు. ఇప్పుడు నేను ఆ యువ‌తికి ఎలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అంటూ రాసుంది. నిజానికి ఆ యువతి అంత లావుగా కూడా లేదు, కానీ వాళ్లు ఎందుకు రిజక్ట్‌ చేశారో తెలియదు కానీ కారణం మాత్రం ఇదే చెప్పారని ఏంజెలెట్టా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు యువతిని రిజక్ట్‌ చేయడం పై మండిపడుతున్నారు.

చదవండి: Interesting Facts About Toothbrush: మొట్టమొదటి టూత్‌ బ్రష్‌ ఎలా తయారుచేశారో తెలిస్తే.. యాక్‌!! పంది శరీరంపై...!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top