Work From Pub Trend: యూకేలో నయా ట్రెండ్‌ ‘వర్క్‌ ఫ్రమ్‌ పబ్‌’.. ఆడుతూ పాడుతూ పని!

Pubs In The UK Have Launched Work From Pub For WFH Employees - Sakshi

లండన్‌: కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌(ఇంటి నుంచే పని)కి చాలా సంస్థలు మొగ్గు చూపాయి. అయితే, ఇంట్లో ఒంటరిగా కూర్చిని పని చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా కాలంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో విసుగు చెందటం సహజమే. అయితే, అలాంటి వారి కోసమే ఈ బంపర్‌ ఆఫర్‌. బ్రిటన్‌లో ఇప్పుడు ‘వర్క్‌ ఫ్రమ్‌ పబ్‌’ అనే సరికొత్త ట్రెండ్‌ నడుస్తోంది. వర్క్‌ అండ్‌ ప్లే అనే కాన్సెప్ట్‌తో బార్లు, పబ్లులు ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులను ఆకట్టుకుంటున‍్నాయి. 

కరోనా కారణంగా బిజినెస్‌ లేక పబ్బులు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి యూకేలోని పబ్బులు. ‘వర్క్‌ అండ్‌ ప్లే’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. యూకేలోని ‘యంగ్‌’ పబ్‌ దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాంచైజీల్లో ఈ ‘వర్క్‌ అండ్‌ ప్లే’ ప్యాకేజీని అందిస్తోంది. పని చేసుకునేందుకు ప్రత్యేక స్థలం, లంచ్‌లో సాండ్‌విచ్‌, అన్‌లిమిటెడ్‌ టీ, కాఫీలు కేవలం రోజుకు 15పౌండ్లు(రూ.1,300)లకే అందిస్తోంది. వర్క్‌ ఫ్రమ్‌ పబ్‌ కల్చర్‌ విస్తరిస్తుండటంతో నలుగురితో కలిసి పనిచేయాలని కోరుకునే ఉద్యోగాలు.. పబ్బుల దారిపడుతున్నారు. ఈ ప్యాకేజీల్లో పవర్‌ సాకెట్స్‌, నిశబ్దంగా ఉండే క్యాబిన్‌లతో పాటు షిఫ్ట్‌ అయిపోగానే జిన్‌, పింట్‌, టోనిక్‌ వంటి వాటిని సైతం సేవించవచ్చు. అయితే, ఈ స్కీమ్‌ను 2020లోనే యంగ్‌ పబ్‌ లాంచ్‌ చేసింది. మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మొత్తం 185 ప్రాంచైజీల్లో అమలు చేస్తోంది.  

తాము పబ్‌లో ఉండే వాతావరణానికే మొగ్గు చూపుతామని కొందరు వర్క్‌ ఫ్రమ్‌ పబ్‌ వినియోగదారులు చెబుతున్నారు. లండన్‌, గ్రీన్‌విచ్లోని కట్టి సార్క్‌ పబ్‌లో ‘వర్క్‌ ఫ్రమ్‌ పబ్‌’ చేస్తున్న ఎడ్యుకేషన్‌ కాపీరైటర్‌ జెన్‌ పలు విషయాలు పంచుకున్నారు. తాను 200 ఏళ్లనాటి వాతవరణాన్ని ఆఫీస్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్యాకేజీ వాటర్‌ కూలర్‌ను దెబ్బ తీస్తుందని చమత్కరించారు. యూకేలోని ఇతర పబ్బులు సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఫుల్లర్‌ పబ్‌ తన 380 ప్రాంచైజీల్లో రోజుకు 10పౌండ్లు(రూ.900)లకే లంచ్‌, డ్రింక్‌ అందిస్తోంది. అలాగే బ్రేవ్‌హౌస్‌ అండ్‌ కిచెన్‌ 10పౌండ్లకే వర్క్‌ స్పేస్‌తో పాటు వైఫై, పవర్‌ సాకెట్స్‌, అన్‌లిమిటెడ్‌ హాట్‌ అండ్‌ సాఫ్ట్‌ డ్రింక్‌, ప్రింటింగ్‌ సైతం అందిస్తోంది.

ఇదీ చదవండి: 1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top