breaking news
pub and bar owners
-
‘వర్క్ ఫ్రమ్ పబ్’.. మందేస్తూ, చిందేస్తూ పని చేయ్..!
లండన్: కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని)కి చాలా సంస్థలు మొగ్గు చూపాయి. అయితే, ఇంట్లో ఒంటరిగా కూర్చిని పని చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో విసుగు చెందటం సహజమే. అయితే, అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. బ్రిటన్‌లో ఇప్పుడు ‘వర్క్ ఫ్రమ్ పబ్’ అనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వర్క్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్‌తో బార్లు, పబ్లులు ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా బిజినెస్ లేక పబ్బులు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి యూకేలోని పబ్బులు. ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. యూకేలోని ‘యంగ్’ పబ్ దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాంచైజీల్లో ఈ ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీని అందిస్తోంది. పని చేసుకునేందుకు ప్రత్యేక స్థలం, లంచ్‌లో సాండ్విచ్, అన్లిమిటెడ్ టీ, కాఫీలు కేవలం రోజుకు 15పౌండ్లు(రూ.1,300)లకే అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్ విస్తరిస్తుండటంతో నలుగురితో కలిసి పనిచేయాలని కోరుకునే ఉద్యోగాలు.. పబ్బుల దారిపడుతున్నారు. ఈ ప్యాకేజీల్లో పవర్ సాకెట్స్, నిశబ్దంగా ఉండే క్యాబిన్లతో పాటు షిఫ్ట్ అయిపోగానే జిన్, పింట్, టోనిక్ వంటి వాటిని సైతం సేవించవచ్చు. అయితే, ఈ స్కీమ్‌ను 2020లోనే యంగ్ పబ్ లాంచ్ చేసింది. మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మొత్తం 185 ప్రాంచైజీల్లో అమలు చేస్తోంది. తాము పబ్‌లో ఉండే వాతావరణానికే మొగ్గు చూపుతామని కొందరు వర్క్ ఫ్రమ్ పబ్ వినియోగదారులు చెబుతున్నారు. లండన్, గ్రీన్విచ్లోని కట్టి సార్క్ పబ్‌లో ‘వర్క్ ఫ్రమ్ పబ్’ చేస్తున్న ఎడ్యుకేషన్ కాపీరైటర్ జెన్ పలు విషయాలు పంచుకున్నారు. తాను 200 ఏళ్లనాటి వాతవరణాన్ని ఆఫీస్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్యాకేజీ వాటర్ కూలర్‌ను దెబ్బ తీస్తుందని చమత్కరించారు. యూకేలోని ఇతర పబ్బులు సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఫుల్లర్ పబ్ తన 380 ప్రాంచైజీల్లో రోజుకు 10పౌండ్లు(రూ.900)లకే లంచ్, డ్రింక్ అందిస్తోంది. అలాగే బ్రేవ్హౌస్ అండ్ కిచెన్ 10పౌండ్లకే వర్క్ స్పేస్‌తో పాటు వైఫై, పవర్ సాకెట్స్, అన్లిమిటెడ్ హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్, ప్రింటింగ్ సైతం అందిస్తోంది. ఇదీ చదవండి: 1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు! -
హైదరాబాద్ : పబ్ లపై పోలీసుల కొరడా...
-
చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు: ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్ కేసులో పబ్ ఓనర్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం తమ కార్యాలయంలో విచారించారు. ఎక్సైజ్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న 17 పబ్బులు, బార్లకు చెందిన యజమానులు, మేనేజర్లకు వాటి నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. ఇకనుంచి జాగ్రత్తగా వ్యవహరించాలని వారికి తగిన సూచనలిచ్చారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే సమాచారం ఇవ్వాలని పబ్బులు, బార్ల యాజమానులను ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నేడు నాలుగోరోజు విచారణ కొనసాగుతోంది. ఇదివరకే పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులను విచారించిన సిట్ అధికారులు నేడు నటుడు తరుణ్‌ను విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డ్రగ్ డీలర్ కెల్విన్‌తో పరిచయాలపై తరుణ్‌ను ప్రశ్నిస్తున్నారు. తరుణ్ గతంలో నిర్వహించిన పబ్‌కు సంబంధించిన వివరాల నేపథ్యంలోనూ విచారణ కొనసాగుతోంది.