జేబులో తుపాకీ..‘యూఎస్‌’లో హాట్‌టాపిక్‌ ఇదే | Possessing Guns Became Hot Topic In America Elections | Sakshi
Sakshi News home page

జేబులో తుపాకీ..‘యూఎస్‌’లో హాట్‌టాపిక్‌ ఇదే

Oct 18 2024 7:02 PM | Updated on Oct 18 2024 7:15 PM

Possessing Guns Became Hot Topic In America Elections

అమెరికాలో గన్‌కల్చర్‌ గురించి ‍ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు సామాన్యులపైకి తుపాకులు ఎక్కుపెడుతుంటారు. వ్యక్తిగత, ఆర్థిక, విద్వేషం,జాాత్యహంకారం ఇలా కారణమేదైనా కావొచ్చు బహిరంగ ప్రదేశాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను అకారణంగా గాల్లో కలిపేస్తుంటారు. ఇలాంటి ఉన్మాద కాల్పులు అగ్రదేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి.

సామాన్యుల మరణాలకు కారణమవుతున్న తుపాకులు దేశంలో అందరూ యథేచ్చగా వాడొచ్చా..వాటి విచ్చలవిడి అమ్మకాలపై నియంత్రణ ఉండాలా వద్దా అనే చర్చ అమెరికాలో ఎప్పటినుంచో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది హాట్‌టాపిక్‌గా మారింది. 

హారిస్‌ ఏమంటున్నారు..

గన్‌ల  విచ్చలవిడి అమ్మకాన్ని నిషేధించాలనే వాదనకు తన మద్దతుంటుందని అధ్యక్ష పోరులో తలపడుతున్న డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.ఇక రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ట్రంప్‌ స్టాండ్‌ ఈ విషయంలో మరోలా ఉంది. 

వెనక్కు తగ్గని ట్రంప్‌..

ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏకంగా తనపైనే కాల్పులు జరిగినా ట్రంప్‌ వెనక్కు తగ్గడం లేదు. తుపాకులు ఎవరికి పడితే వారికి అమ్మడాన్ని ఆయన మద్దతిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకేసి బైడన్‌ హయాంలో గన్‌ల నియంత్రణపై తెచ్చిన చట్టాలేవైనా ఉంటే వాటిని తాను పవర్‌లోకి రాగానే రద్దు చేస్తానని కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మద్దతిస్తున్న టెక్‌ బిలియనర్‌, టెస్లా అధినేత ఇలాన్‌ మస్క్‌ గన్‌ కల్చర్‌పై ఒక ట్వీట్‌ చేశారు. 

మద్దతిస్తే 100 డాలర్లు.. ‘మస్క్‌’ వింత ఆఫర్‌ 

పెన్సిల్వేనియాలో ఓటర్‌గా నమోదై ఉండి వాక్‌స్వాతంత్రం, అందరూ తుపాకులు కలిగి ఉండడం అనే అంశాలకు మద్దతిస్తున్నవారందరికీ మస్క్‌ ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఈ అంశాలకు మద్దతుగా రూపొందించిన తమ పిటిషన్‌పై సంతకం పెడితే 100 డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. 

 గన్‌ కల్చర్‌ ఎఫెక్ట్‌.. అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలివీ..

  • ఓక్లహామాలోని ఓక్లహామా నగరంలో ఇటీవల రెండురోజుల్లో వరుసగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

  • అలబామా రాష్ట్రం బర్మింగ్‌హమ్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన బహిరంగ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. డజను మందికిపైగా గాయపడ్డారు.

  • టెక్సాస్‌లోని అలెన్‌లో ఓ షాపింగ్‌ సెంటర్‌లో దుండగుడు జరిపిన బహిరంగ కాల్పుల్లో 8 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు.చివరికి పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించాడు.

ఇదీ చదవండి: హారిస్‌ సారీలు..హామీలు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement