పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక నిర్ణయం 

Pope Francis Renews Curbs On Latin Mass In Rebuff To Conservatives - Sakshi

రోమ్‌: క్రైస్తవుల ఆరాధనా పద్ధతికి సంబంధించిన వ్యవహారంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చిలో చీలికకు కారణమవుతోందనే కారణంతో ‘లాటిన్‌ మాస్‌’పై శుక్రవారం ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ చర్యతో మాజీ పోప్‌ బెనెడిక్ట్‌16 తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌ వ్యతిరేకించినట్లు అయింది. ప్రస్తుతమున్న స్థానిక భాష ఆరాధనా క్రమాన్ని 1960లలో జరిగిన వాటికన్‌2 సమావేశం నుంచి పాటిస్తున్నారు. అంతకు ముందు ఆ కార్యక్రమాన్ని కేవలం లాటిన్‌ భాషలోనే ప్రపంచమంతటా నిర్వహించేవారు. అయితే కొన్ని చోట్ల లాటిన్‌ భాష ఇంకా కొనసాగుతుండగా, పోప్‌ దానిపై ఆంక్షలు పెట్టారు.

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల బిషప్‌లెవరూ వారి ప్రాంతాల్లో లాటిన్‌ మాస్‌ గ్రూపులు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా ఈ ఆంక్షల్లో పోప్‌ ప్రస్తావించారు. అంతర్గతంగా చర్చిలో జరుగుతున్న వ్యవహారాలపై పోప్‌ నివేదిక తెప్పించుకోగా, అందులో లాటిన్‌ మాస్‌ వ్యవహారంపై ప్రత్యేక గ్రూపులు ఉన్నట్లు తేలింది. దీంతో తప్పక జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత తనపై పడిందని పోప్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పోప్‌పై సంప్రదాయవాదులు ఆయన నిర్ణయంపై వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top