గాల్లో పేలిన విమానం.. ఫైలట్‌ అప్రమత్తతతో 288 మంది సేఫ్ | Delta Airlines Flight In Brazil Escapes Major Disaster After Engine Fire Mid-Air, More Details Inside | Sakshi
Sakshi News home page

గాల్లో పేలిన విమానం.. ఫైలట్‌ అప్రమత్తతతో 288 మంది సేఫ్

Mar 31 2026 4:24 AM | Updated on Mar 31 2026 5:40 PM

Pilot cleverly tackles plane fire in Brazil

బ్రెజిల్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో పేలుడు సంభవించి విమానం గాల్లో ఉండగానే  మంటలు చెలరేగాయి. ఈ వివరాలు తెలుసుకున్న ఫైలట్ ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా చాకచాక్యంగా వ్యవహరించారు.  విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో విమానంలో 288 మంది ప్రయాణికులున్నారు. ఫైలట్‌ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement