విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం..

Passenger Physical Clash With Another Passenger At Bangladesh Flight - Sakshi

విమానంలో మరో ప్రయాణికుడు వీరంగ సృష్టించాడు. గాలో ఉండగానే మరో ప్రయాణికుడిపై దాడి చేస్తూ రెచ్చిపోయాడు. ఏకంగా విమానంలో గాల్లో ఉండగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు ఇద్దరు ప్రయాణికులు. ఈ ఘటన బిమన్‌ బంగ్లాదేశ్‌ బోయింగ్‌ 777లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..విమానంలో సుమారు 20 ఏళ్ల యువకుడు చొక్కా లేకుండా మరో ప్రయాణికుడిపై భౌతిక దాడికి దిగాడు. దారుణంగా పిడిగుద్దులతో సదరు ప్రయాణికుడి కొట్టడం ప్రారంభించాడు. బాధిత ప్రయాణికుడు కూడా తనను రక్షించుకునే క్రమంలో ఎదురుదాడి చేశాడు. దీంతో ఆందోళనకు గురైన కొందరూ ప్రయాణకులు గొడవ సద్ధుమణిగేలా చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా సరే తమ గొడవ తమదే అన్నట్లు ప్రవర్తించారు ఆ ఇద్దరూ ప్రయాణికులు.

ఎయిర్‌ ఇండియా విమానంలో మూత్ర విసర్జన ఘటన మరువక మునుపే వరుసగా ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఐతే ఆ విమానం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఘటన నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: 98 ఏళ్ల వృద్ధ ఖైదీకి..ఘనంగా జైలు సిబ్బంది వీడ్కోలు)

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top