Viral Video: 98 ఏళ్ల వృద్ధ ఖైదీకి..ఘనంగా జైలు సిబ్బంది వీడ్కోలు

98 Year Old Man Released From UP Jail Get Farewell From Jail Staff - Sakshi

జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఘనంగా వీడ్కోలు పలకడం చాలా అరుదు. ఒకవేళ మంచి సత్ప్రవర్తన కారణంగానో లేక ఏదైన మంచి పనులు చేసినట్లయితే గనుక వారిని మంచిగా సన్మానించి విడుదల చేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇలా ఒక ఖైదీకి జైలు సూపరింటెండెంటే ఏకంగా స్వయంగా కారు వద్దకు తీసుకువెళ్లి ఘనంగా పంపిచడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

వివరాల్లోకెళ్తే..98 ఏళ్ల రామ్‌ సూరత్‌ అనే వృద్ధ ఖైదీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జైలు నుంచి విడుదలయ్యాడు. అతడు ఐపీసీ సెక్షన్‌​ 452, 323, 352 కింద దోషిగా నిర్థారించి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు.  ఈ మేరకు జైలు శిక్ష అనంతర విడుదలైన రామ్‌ సూరత్‌ని తీసుకుని వెళ్లేందుకు అతని కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు.

దీంతో జైలు సూపరింటెండెంట్‌ శశికాంత్‌ మిశ్రా పుత్రావత్‌ ఘనంగా వీడ్కోలు పలుకుతూ..స్వయంగా ఆయనే ఆ వృద్ధ ఖైదీ వెంట వచ్చి కారు ఇచ్చి మరీ అతని ఇంటికి పంపించారు. వాస్తవాని సూరత్‌ ఆగస్టు8న విడుదల కావాల్సి ఉంది. కానీ మే 20, 2022న కోవిడ్‌ ఉన్నట్లు నిర్థారణ కావడంతో 90 రోజులపాటు పెరోల్‌పై ఉన్నారు.

అందుకు సంబంధించిన ఘటనను ఉత్తరప్రదేశ్‌ డీజీ ప్రిజన్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు 98 ఏళ్ల వృద్ధుడిని జైలులో ఉంచడం మానవత్వం అని ఫైర్‌ అవుతుండగా, మరికొందరూ మాటలు రావడం లేదు ఎంత ఘనంగా పంపిచారంటూ జైలు సిబ్బందిపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. 

(చదవండి: వేధించాడని ఇంటికి పిలిచి హత్య)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top