Paper Plane World Record: కాగితపు రాకెట్‌తో గిన్నిస్‌ రికార్డు! వీడియో వైరల్‌

Paper Plane Flew More Than Distance 252 Feet Break World Record - Sakshi

కాగితపు రాకెట్‌లు గురించి అందరికి తెలిసే ఉంటుంది. మనందరం చిన్నప్పుడు సరదాగా ఒకరిపై ఒకరు వేసుకునే పేపర్‌ రాకెట్లు. క్లాస్‌లో ఉన్నప్పుడూ లేదా ఎప్పుడైన సరదాగా మన స్నేహితుల్ని ఆటపట్టించేందుకు రాకెట్‌లు చేసి వేస్తుండే వాళ్లం. ఆ కాగితపు రాకెట్ల గురించి అంతవరకే మనకు తెలుసు. కానీ కొంత మది వాటితో ఏకంగా గిన్నిస్‌ రికార్డులు సృష్టిస్తున్నారు. ఎలాగో తెలుసా!

వివరాల్లోకెళ్తే...చిన్నప్పుడూ ఈ పేపర్‌ రాకెట్‌లు తయారు చేసి నాదే బాగా ఎత్తుకు వెళ్లింది అంటూ తెగ సంబరపడి పోయే వాళ్లం ఔనా!. ఆ రాకెట్‌ మంచి ఎత్తుకు బాగా ఎగిరేతే ఎంచక్కా గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కేయొచ్చు. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన కిమ్ క్యు టే విసిరిన పేపర్‌ రాకెట్ సుమారు 77.134 మీ(252 అడుగుల 7 అంగుళాలు) దూరం ప్రయాణించింది. ఇంతక మునుపు 2012లో అమెరికన్ క్వార్టర్‌బ్యాక్ జో అయోబ్, ఎయిర్‌ప్లేన్ డిజైనర్ జాన్ ఎమ్. కాలిన్స్ పేరిట ఉన్న రికార్డును కిమ్‌ బద్దలు గొట్టాడు.

ఐతే జో అయోబ్, కాలిన్స్‌ విసిరిన రాకెట్ సుమారు 69.14 మీ (226 అడుగుల 10 అంగుళాలు) దూరం ప్రయాణించి  రికార్డును సృష్టించారు. కానీ కిమ్‌ ఆ రికార్డును చేధించి మరి సరికొత్త రికార్డును తిరగ రాశాడు. ఈ మేరకు కిమ్‌ తన స్నేహితులు షిన్ మూ జూన్,  చీ యీ జియాన్ మద్దతుతో ఈ రికార్డుని సృష్టించగలిగానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఈ ఘటనక సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top