breaking news
paper craft workshop
-
కాగితపు రాకెట్‌తో గిన్నిస్ రికార్డు! వీడియో వైరల్
కాగితపు రాకెట్లు గురించి అందరికి తెలిసే ఉంటుంది. మనందరం చిన్నప్పుడు సరదాగా ఒకరిపై ఒకరు వేసుకునే పేపర్ రాకెట్లు. క్లాస్‌లో ఉన్నప్పుడూ లేదా ఎప్పుడైన సరదాగా మన స్నేహితుల్ని ఆటపట్టించేందుకు రాకెట్లు చేసి వేస్తుండే వాళ్లం. ఆ కాగితపు రాకెట్ల గురించి అంతవరకే మనకు తెలుసు. కానీ కొంత మది వాటితో ఏకంగా గిన్నిస్ రికార్డులు సృష్టిస్తున్నారు. ఎలాగో తెలుసా! వివరాల్లోకెళ్తే...చిన్నప్పుడూ ఈ పేపర్ రాకెట్లు తయారు చేసి నాదే బాగా ఎత్తుకు వెళ్లింది అంటూ తెగ సంబరపడి పోయే వాళ్లం ఔనా!. ఆ రాకెట్ మంచి ఎత్తుకు బాగా ఎగిరేతే ఎంచక్కా గిన్నిస్ రికార్డులోకి ఎక్కేయొచ్చు. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన కిమ్ క్యు టే విసిరిన పేపర్ రాకెట్ సుమారు 77.134 మీ(252 అడుగుల 7 అంగుళాలు) దూరం ప్రయాణించింది. ఇంతక మునుపు 2012లో అమెరికన్ క్వార్టర్‌బ్యాక్ జో అయోబ్, ఎయిర్‌ప్లేన్ డిజైనర్ జాన్ ఎమ్. కాలిన్స్ పేరిట ఉన్న రికార్డును కిమ్ బద్దలు గొట్టాడు. ఐతే జో అయోబ్, కాలిన్స్ విసిరిన రాకెట్ సుమారు 69.14 మీ (226 అడుగుల 10 అంగుళాలు) దూరం ప్రయాణించి రికార్డును సృష్టించారు. కానీ కిమ్ ఆ రికార్డును చేధించి మరి సరికొత్త రికార్డును తిరగ రాశాడు. ఈ మేరకు కిమ్ తన స్నేహితులు షిన్ మూ జూన్, చీ యీ జియాన్ మద్దతుతో ఈ రికార్డుని సృష్టించగలిగానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఈ ఘటనక సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు) -
బాటిల్ ఆర్ట్
పనికిరాని గాజు బాటిల్స్ చక్కని కళాకృతులయ్యాయి. రంగు రంగుల కాగితాలను అద్దుకుని రంగవల్లుల్లా ముస్తాబయ్యాయి. సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం ఏర్పాటు చేసిన పేపర్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లో ఔత్సాహికుల చేతుల్లో ఇలాంటివెన్నో చూడముచ్చటైన ఆకృతులు రూపుదిద్దుకున్నాయి. పేపర్ క్రాఫ్ట్‌లో నిపుణుడు సరోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 18వ శతాబ్దంలో విక్టోరియన్ ఆర్ట్‌గా ప్రసిద్ధి పొందిన ఈ కళను నేర్చుకోవడానికి సీనియర్ సిటిజన్స్ కూడా ఆసక్తి చూపారు. ‘ఈ సృష్టిలో పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. ప్రతిదాన్నీ రీసైకిల్ చేయవచ్చు. దీని వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు తప్పించవచ్చు. అలాగే ఇలా ఇంట్లో ఉపయోగించుకొనేలా డెకరేటివ్ ఐటెమ్స్ చేసుకోవచ్చు. ఈ ఆర్ట్ కాస్త కొత్తగా ఉంది. అందుకే నేర్చుకోవడానికి ఆసక్తిగా వచ్చా’ అన్నారు గృహిణి అంజలి. ‘ముచ్చటైన ఈ కళను చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. మనసుకు నచ్చిన వ్యాపకం వల్ల మనసుకు ఆహ్లాదం లభిస్తుంది. చిన్న చిన్న చిట్కాలతో ఆకట్టుకునే ఇలాంటి వస్తువులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బాటిల్స్‌తో పాటు ఉడెన్‌పై కూడా పేపర్ క్రాఫ్ట్తో అందమైన వస్తువులు తయారు చేయవచ్చు’ అంటారు శారదారెడ్డి. - దార్ల వెంకటేశ్వరరావు