దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్‌ ప్రధాని | Pakistan PM Imran Khan Greets Hindu People On Diwali | Sakshi
Sakshi News home page

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్‌ ప్రధాని

Nov 14 2020 6:36 PM | Updated on Nov 14 2020 6:44 PM

Pakistan PM Imran Khan Greets Hindu People On Diwali - Sakshi

ఇస్లామాబాద్‌ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తన దేశంలోని మైనార్టీలైన హిందువులకు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సోషల్ మీడియా వేడుకగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు. కాగా, దీపావళి పండగను పాకిస్తాన్‌ హిందూవులు ఘనంగా జరుపుకుంటారు. భారత్‌లో మాదిరే దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుకుంటారు.  

ఆలయాలు, గృహాలను అందంగా అలంకరించుకుని సంబరాలు జరుపుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కరాచీ, లాహోర్ లాంటి ప్రధాన నగరాలతో పాటు, మాటియారి, టాండో అల్లాహార్, టాండో ముహమ్మద్ ఖాన్, జంషోరో, బాడిన్, సంఘర్, హాలా, టాండో ఆడమ్, షాదాద్‌పూర్‌లలో కూడా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. పాకిస్తాన్‌ మైనారిటీ వర్గాల్లో హిందువులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 75 లక్షల మంది హిందువులు ఉన్నట్లు అధికార ఘణాంకాలు చెబుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement