ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు.. గుండెపోటుతో మృతి..

Pakistan Man Who Has Six Wives And 54 Children Died Heart Attack - Sakshi

ఇస్లామాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి యజామానిగా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ మజీద్ మంగల్‌(75) తుదిశ్వాస విడిచాడు. పాకిస్తాన్‌కు చెందిన ఈయన.. బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అబ్దుల్ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

డ్రైవర్‌గా పనిచేసే అబ్దుల్‌కు మొత్తం ఆరుగురు భార్యలు. 54 మంది పిల్లలు. బలూచిస్తాన్ నోష్కి జిల్లా కాలి మంగల్ గ్రామంలో నివసిస్తున్నాడు. అయితే ఆరుగురు భార్యల్లో ఇద్దరు చనిపోయారు. 54 మంది పిల్లలో 12 మంది వివిధ కారణాలతో మరణించారు. మిగిలిన 42 మంది పిల్లలలో 22 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఉన్నారు. అబ్దుల్ మనవళ్లు, మనవరాళ్లను కూడా కలిపితే ఆయన కుటుంబంలో మొత్తం 150 మంది  అవుతారు.

అబ్దుల్ 18 ఏళ్ల వయసులోనే తొలి వివాహం చేసుకున్నాడు. 2017లో జనాభా లెక్కల కోసం ఆయన ఇంటికి వెళ్లిన సబ్బింది వివరాలు సేకరించాక కంగుతిన్నారు. ఆయనకు ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు అని తెలిసి అవాక్కయ్యారు. అప్పటినుంచే ఆయన అతిపెద్ద కుటుంబానికి యజమానిగా గుర్తింపు పొందారు.
చదవండి: Rishi Sunak: ఓటమి భయంతో..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top