రిషి సునాక్‌పై నమ్మకం సన్నగిల్లి.. ఓటమి భయంతో.. చికెన్‌ రన్‌!

No Confidence On Rishi Sunak UK Conservatives Chicken Run Again - Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌పై అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన అధినాయకత్వంలో తిరిగి గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో.. చట్ట సభ్యులంతా ఆందోళనతో గందరగోళానికి తెర తీస్తున్నారు.

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే ఆందోళనలో కూరుకుపోయారు కన్జర్వేటివ్‌ సభ్యులు చాలామంది. ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారట చాలామంది. అంతేకాదు.. మరికొందరైతే వేరే చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

రిషి సునాక్‌ నేతృత్వంలో ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా కొద్ది మందిలోనే నెలకొన్నట్లు పార్టీ అంతర్గత సమావేశాలు, పోల్స్‌ ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాలపై కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత స్పందిస్తూ.. బహుశా ఎంపీలు హెలికాప్టర్‌లలో తమ తమ నియోజకవర్గాలను వెతుక్కుంటే బావుంటేదేమో అంటూ చమత్కరించారు. 

90వ దశకంలో టోనీ బ్లేయర్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ.. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు ఓడిపోకుండా ఉండేందుకు సురక్షితమైన స్థానాల్లో పోటీ కోసం చేసిన ప్రయత్నాలను చికెన్‌ రన్‌గా అభివర్ణించాయి. అంటే కోళ్లు పరిగెత్తినట్లు హడావుడిగా తమ తమ సురక్షిత స్థానాల కోసం ఎంపీలు పరుగులు పెట్టారని ఎద్దేవా చేసింది. అప్పటి నుంచి ఆ పదం అలా బ్రిటన్‌ రాజకీయాల్లో స్థిరపడిపోయింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top