అమెరికాలో బాలలపైకి దుండగుడి కాల్పులు

One Boy Killed, 5 Others Injured in Cincinnati Gun Shootings - Sakshi

సిన్సినాటి: అమెరికాలోని సిన్సినాటిలో ఓ సాయు ధుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో 11 ఏళ్ల బాలుడు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు బాలలు గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగుడు యథేచ్ఛగా 22 రౌండ్లు కాల్చినట్లు పోలీసు అధికారి టెర్రీ తెలిపారు. ఆ వెంటనే దుండగుడు ఘటనా స్థలి నుంచి మాయమ య్యాడన్నా రు.

ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు. బుల్లె ట్లు తగిలి 53 ఏళ్ల మహిళ, 11 ఏళ్ల బాలుడు ఘట నాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా, 12, 13, 15 ఏళ్ల ముగ్గురు బాలురు, 15 ఏళ్ల బాలిక గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆమె వివరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top