Omicron Effect: తరుముకొస్తున్న ఒమిక్రాన్‌.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!

Omicron Effect Top SA Scientist Vaccination Still Prevent Serious Illness - Sakshi

గతంలో సోకిన ఇన్‌ఫెక్షన్‌.. ఒమిక్రాన్‌ నుంచి కాపాడలేదు

పరిస్థితి విషమించకుండా ఉండాలంటే టీకానే మార్గం

జోహన్నెస్‌బర్గ్: కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం అయ్యేలా లేదు. కాలం గడుస్తున్న కొద్ది.. మహమ్మారి తన రూపు మార్చుకుంటూ.. మరింత శక్తిమంతంగా మానవాళి మీద దాడి చేస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు డెల్టా వేరియంట్‌ జనాలను బెంబెలెత్తించింది. దాన్నుంచి తేరుకుని.. కాస్త ఊపిరి పీల్చుకునే సమయానికి ఒమిక్రాన్‌ దాడి ప్రారంభించింది.

ఒమిక్రాన్‌ డెల్టా కన్నా కూడా ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. అప్పుడే ప్రపంచ దేశాలను చుట్టేస్తూ.. భారత్‌లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
(చదవండి: మరో వుహాన్‌.. అక్కడ 90 శాతం కరోనా కేసుల్లో ‘ఒమిక్రాన్‌’)

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నిపుణుడు అన్నే వాన్ గాట్‌బర్గ్ మాట్లాడుతూ.. ‘‘గతంలో కోవిడ్‌ బారిన పడినవారికి.. ఒమిక్రాన్‌ సోకదనే గ్యారెంటీ లేదు. గతంలో సోకిన ఇన్‌ఫెక్షన్‌.. ఒమిక్రాన్‌ నుంచి కాపాడలేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహమ్మారి ముప్పు ముంచుకొస్తున్న వేళ వ్యాక్సిన్‌ మాత్రమే మనల్ని కాపాడగలదు. తీవ్రమైన జబ్బుల బారిన పడకుండా ఉండటమే కాక.. మహమ్మారి సోకితే పరిస్థితి విషమించకుండా.. ఆస్పత్రిలో చేరే పరిస్థితి తలెత్తకుండా టీకా మనల్ని సంరక్షిస్తుంది’’ అని తెలిపారు. 
(చదవండి: భారత్‌లో ఒమిక్రాన్‌ కలకలం)

ఒమిక్రాన్‌ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో వెలుగు చూడటంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు.. సౌతాఫ్రికా, దాని చుట్టుపక్కల దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాల నిర్ణయంపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మేలు కోసం మేం ఒమిక్రాన్‌ ఉనికి గురించి ముందుగానే హెచ్చరిస్తే.. మాపై ఇలా నిషేధం విధించడం తగదన్నారు. 

చదవండి: ఒమిక్రాన్‌కు ‘సినిమా’ చూపిద్దాం! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top