ఐదేళ్లలో బైడెన్ చనిపోతారు.. ఆయనకు ఓటెస్తే కమలా హారిస్‌ను ప్రెసిడెంట్ చేసినట్లే..

Nikki Haley Says Joe Biden Will Die In 5 Years Kamala Harris President - Sakshi

వాషింగ్టన్‌: వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున నిక్కీ హేలీ బరిలో ఉన్నారు. అయితే  ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  బెడైన్‌కు ఓటేస్తే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రెసిడెంట్ అవుతారని, ఎందుకంటే ఆయన ఐదేళ్లకు మించి బతకరని హేలీ అన్నారు. 

జో బైడెన్ ప్రస్తుత వయసు 80 ఏళ్లు దాటింది. హేలీ వయసు 51 ఏళ్లే. అందుకే ఎన్నికల ప్రచారంలో వయసునే ప్రధాన అస్త్రంగా మలుచుకుని ముందుకెళ్లాలని హేలీ భావిస్తున్నారు. వృద్ధులను ఎన్నుకునే ముందు ఆలోచించాలని అమెరికన్లను కోరుతున్నారు. సరిగ్గా ఆరోగ్యంగా లేని వారు అగ్రరాజ్యాన్ని ముందుకెలా నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. 75 దాటి ఎన్నికల్లో పోటీ చేసేవారికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలనే కొత్త డిమాండ్‌ను ఆమె తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం 80 ఏళ్లు దాటిన బైడెన్.. మరో ఐదేళ్లు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంటారని తనకు నమ్మకం లేదని హేలీ అన్నారు.

మరోవైపు తాను మరోసారి డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలో ఉంటున్నట్లు బైడెన్ మంగళవారమే అధికారికంగా ప్రకటించారు. తాను పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. శ్వేతసౌధం కూడా బైడెన్‌ కోటు ధరించి జాగింగ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. తీరిక లేకుండా ఆయన చేస్తున్న వివిధ పర్యటనల షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. దీంతో బైడెన్‌ తనకు ఎలాంటి ఆరోగ్య, మానసిక సమస్యలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రిపబ్లికన్లను ఓడించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
చదవండి: గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్‌’ తొలగించండి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top