New Zealand Announce: నో డోస్‌.. నో జాబ్‌

New Zealand Announce no jab no job Policy For FrontLine Workers Due To Covid Vaccine - Sakshi

వెల్లంగ్టన్‌: కోవిడ్‌ -19 మహమ్మారి నివారణ చర్యల్లో భాగాంగా ఆరోగ్య కార్య కర్తలు,నర్సులు, డాక్టర్లు, టీచర్లు వ్యాక్సిన్‌ తీసుకోనట్లయితే ఉద్యోగం ఉండదంటూ.. ‘నో జాబ్‌(టీకా) నో జాబ్‌’ అనే ఒక సరికొత్త నినాదాన్ని న్యూజిలాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనసరి చేయడమే కాక.. ఇందుకోసం ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి  తాము సిద్దంగా ఉన్నామని.. ఏ చిన్న అవకాశాన్ని వదలమని  విద్యాశాఖ మంత్రి క్రిస్‌ హిప్కిన్స్‌ పేర్కొన్నారు.

(చదవండి: భారత స్పేస్‌ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ)

బయట పనిచేసే ఉద్యోగస్తులు, టీచర్లు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు డిసెంబర్‌ 1లోపు వ్యాక్సిన్‌ రెండు డోసులు కచ్చితంగా తీసుకోవల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. రాయల్‌ న్యూజిలాండ్‌ కాలేజ్‌ ఆఫ్‌ జనరల్‌ ప్రాక్టీషనర్స్‌ స్వచ్ఛందంగా తప్పనిసరిగా అందరికీ టీకాలు వేయడాన్ని అత్యవసరమైన  గొప్ప పనిగా ఆ దేశ అధ్యక్షురాలు సమంత మర్టన్ అభివర్ణించారు. విద్యాసంస్థల్లో టీకాలు వేయించుకున్నట్లుగా ఒక రిజిస్టర్‌ను కూడా పొందుపర్చాలని ఆదేశించారు. ఇన్ఫెక్షన్స్‌, రకరకాల వ్యాధుల భారీ నుంచి సురక్షితంగా ఉండాలంటే వ్యాక్సిన్‌లు అత్యంత బలమైన రక్షణ సాధనాలు అని విద్యా శాఖ మంత్రి హిప్కిన్స్‌ నొక్కి చెప్పారు.

డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందక మునుపు న్యూజిలాండ్‌ కోవిడ్‌ రహిత దేశంగా ప్రశంలందుకున్న విషయం తెలిసిందే. కానీ తదనంతర పరిణామాల్లో ఆక్లాండ్‌లో డెల్టా వేరియంట్‌ని గుర్తించిన వెంటనే నార్త్‌ల్యాండ్‌ నుంచి వైకాటో ప్రావిన్సుల వరకు విస్తరించిన నేపథ్యంలో వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి చేస్తూ న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఈ కఠిన ఆంక్షలను విధించింది.

(చదవండి: కస్టమర్‌కి షాకిచ్చిన ఫ్లిప్‌కార్టర్ట్‌: ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top