కస్టమర్‌కి షాకిచ్చిన ఫ్లిప్‌కార్టర్ట్‌: ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే...

Flipkart Customer Order Apple iPhone Instead Of Nirma soaps - Sakshi

ముంబై: మనం ఆన్‌లైన్‌లో ఏదైన ఆర్డర్‌ చేస్తే మనం ఆర్డర్‌ చేసింది కాకుండా వేరేది వచ్చి అది కూడా మనం వేలు ఖరీదు చేసే ఆర్డర్‌కి పొంతన లేకుండా కేవలం రూపాయల్లో ఖరీదు చేసే వస్తువు వస్తే మనకి ఎంతో టెన్షన్‌గా అనిపిస్తోంది కదూ. అలాంటి సంఘటనే ఒకటి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలో జరిగింది.

అసలేం జరిగిందంటే దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బిగ్‌ బిలయన్‌ డే సేల్‌ ప్రారంభించి భారీగా ఆఫర్ల కురిపించిన సంగతి తెలిసిందే. చాలా మంది స్పెషల్ డిస్కౌంట్ సమయాల్లో తమకు కావాల్సిసిన వాటిని ఆర్డర్‌ చేసుకుంటారు. అలానే సిమ్రాన్‌ పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి భారీ డిస్కౌంట్‌ లభిస్తుండటంతో 50 వేలు ఖరీదు చేసే ఆపిల్‌ ఐ ఫోన్‌12 సిరీస్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్‌ చేశాడు. తన ఐఫోన్‌ ఎ‍ప్పుడూ వస్తుందా అని చాలా ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాడు. ఆర్డర్‌ వచ్చాకా ఎంతో ఉత్సాహంగా ప్యాకెట్‌ని ఒపెన్‌ చేశాడు. దాంట్లో ఉన్న వాటిని చూసి షాకయ్యాడు. ఎందుకంటే తను ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫ్లిప్‌కార్ట్‌ నిర్మా సబ్బులు పంపింది.

దీంతో ఒకస్కారిగా సింగ్‌ షాక్‌కి గురైయ్యాడు. వెంటన్‌ సింగ్‌ కస్టమర్‌ కేర్‌కి కంప్లయిట్‌ చేయడంతో ఫ్లిప్‌ కార్ట్‌ తన తప్పుని అంగీకరించి వెంటనే ఆ ఆర్డర్‌ని కేన్సిల్‌ చేసి  డబ్బుని సదరు వ్యక్తి కి వాపస్‌ చేసింది. అయితే సింగ్‌ ఈ ఘటనను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రముఖ దిగ్గజ కంపెనీ ఈ విధంగా చేయడం ఏమిటంటూ నెటిజన్లు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైన డెలివరీని కస్టమర్‌లకు పంపించే ముందు ఒక్కసారి చెక్‌ చేసి పంపించాలి మరీ ఇలాంటి అత్యంత ఖరీదైన వస్తువుల విషయంలో తగు జాగ్రత్త అవసరం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

(చదవండి: భారత స్పేస్‌ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top